ప్రస్తుత రోజుల్లో చాలామంది కడుపుకి సంబందించిన చాలారకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. మలబద్ధకం,అజీర్ణం, కడుపులో మంట కడుపు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా పొట్టకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాను పాటించాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రస్తుతం ఎక్కువ మంది మలబద్ధక సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. మలం విసర్జించేటప్పుడు నొప్పితో పాటు కొన్నిసార్లు రక్తం కూడా వస్తూ ఉంటుంది. మలబద్ధక సమస్య ఉన్నవారికి ఫ్రీగా మోషన్ అవ్వదు. మల విసర్జన చాలా కష్టంగా ఉంటుందట.
ఈ సమస్యతో బాధపడేవారు వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే మల విసర్జనకి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ప్రత్యక్ష నరకం చూస్తూ ఉంటారు. గంటలకొద్దీ బాత్రూంలో ఉంటారు. అయితే మలబద్ధకం సమస్యలు అధిగమించడానికి చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల మెడిసిన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఆ మల బద్ధకం సమస్య నుంచి బయట పడాలంటే ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలను నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల మల బద్ధకాన్ని తగ్గించుకోవచ్చట. పాలు, నెయ్యి కలిపి తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగు పర్చడమే కాకుండా పేగుల కదలిక మెరుగుపడుతుందట. సరైన సమయంలో ఈ మిశ్రమాన్ని తాగితే మంచి ఫలితాలు ఉంటాయట. మలబద్ధకానికి చెక్ పెట్టడం కోసం ముందుగా ఒక గ్లాస్ పాలు తీసుకుని బాగా మరగించాలని చెబుతున్నారు. ఆ తర్వాత కాస్త చల్చార్చి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఒక స్పూన్ స్వచ్చమైన నెయ్యిని పాలలో కలపాలి.
బాగా కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడే నెమ్మదిగా తాగాలి. ఇలా చేయడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గిపోతుందట. అంతేకాకుండా పొట్టలో పేరుకుపోయిన చెడు అంతా బయటకు వచ్చేస్తుందట. పాలు, నెయ్యి కలయిక జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. పాలలో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి పేగుల పనితీరును మెరుగుపరుస్తాయట. నెయ్యిలో ఉండే కొవ్వు ఆమ్లాలు ప్రేగుల కదలికను పెంచుతాయట. ఇది మలాన్ని సులభంగా తొలగించడంలో సహాయపడుతుందట. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయట. నెయ్యి సహజ కందెనగా పనిచేస్తుందట. పేగు లోపల మలం వెళ్ళడానికి వీలు కల్పిస్తుందట. దీంతో మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందట.
పేగులలో వాపు, చికాకు లేదా గ్యాస్ సమస్య ఉంటే , పాలు, నెయ్యి మిశ్రమం బెస్ట్ ఆప్షన్. ఈ మిశ్రమం తాగడం వల్ల పేగు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి పేగు మంటను తగ్గిస్తాయి. పాలు జీర్ణసమస్యలకు చెక్ పెడతాయి. ఈ కలయిక జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగుల్ని ఆరోగ్యంగా ఉంచుతుందట. ఈ మిశ్రమాన్ని ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందట. నిద్రపోయే ముందు దీన్ని తాగడం వల్ల, రాత్రంతా శరీరంలో పనిచేస్తుందట. అలాగే పేగులకు ఉపశమనం కలిగిస్తుందట. మరుసటి రోజు మలవిసర్జన సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదట.