Weight Loss: దాదాపుగా ప్రతీ ఒక్కరి ఇంట్లో నెయ్యి తప్పనిసరిగా ఉంటుంది. నెయ్యిని ఎన్నో రకాల వంటల తయారీలలో, స్వీట్ల తయారీలో వినియోగిస్తూ ఉంటారు. కొందరు ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి ఉపయోగిస్తే మరికొందరు బయట దొరికే దేశీ నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటారు. కాగా నెయ్యి తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం తెలిసిందే. నెయ్యిని ఆహారంతో పాటు తినడమే కాకుండా ఖాళీ కడుపుతో కూడా తినవచ్చట.
ఖాళీ కడుపుతో నెయ్యి తినడం వల్ల మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని, అయితే మరి ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.. నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతుందని మీరు అనుకుంటే మీరు భ్రమ పడనట్లే. నెయ్యి శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందట. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందని, బరువు తగ్గాలి అనుకునే వారు మీరు ఎక్కువ నెయ్యి తినకూడదని చెబుతున్నారు.
ఇది ఆరోగ్యనానికి కూడా హానికరం అని చెబుతున్నారు. జీలకర్ర పొడిని నెయ్యిలో కలిపి తినడం వల్ల బరువు పెరిగే రేటు తగ్గుతుందట. మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటే నెయ్యి సహాయపడుతుందని చెబుతున్నారు. నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది చర్మానికి చాలా ముఖ్యమని, వీటి వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుందని చెబుతున్నారు. చర్మంపై ఉన్న ఫైన్ లైన్స్, ముడతలు మొదలైనవి తగ్గుతాయట. ఇది పొడి చర్మానికి ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుందట. ఎందుకంటే ఇది చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుందని, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతున్నారు. నెయ్యి జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుందట. ఇందులో ఉండే కొవ్వు ఆమ్లాలు జుట్టుకు సహజ కండిషనర్లుగా పనిచేస్తాయట. అందువల్ల, ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యి తినడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుందని, జుట్టు రాలడం కూడా తగ్గుతుందని చెబుతున్నారు.
Weight Loss: నెయ్యిలో ఈ పొడి కలిపి తింటే చాలు.. ఐస్ లాగా బరువు తగ్గడం ఖాయం!

Weight Loss