Site icon HashtagU Telugu

Ghee For Health: చలికాలంలో రోజు ఒక స్పూన్ నెయ్యి తింటే ఏం జరుగుతుంది తెలుసా?

Mixcollage 06 Dec 2023 06 56 Pm 7839

Mixcollage 06 Dec 2023 06 56 Pm 7839

చలికాలం మొదలైంది. చలికాలం వచ్చింది అంటే చాలు దగ్గు జలుబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చలికాలంలో కేవలం ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు మాత్రమే కాకుండా అందానికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. వేసవి కాలంలో మాదిరిగానే చలికాలంలో కూడా శరీరానికి తగినన్ని నీళ్లు తీసుకోవాలి. చాలామంది నెయ్యి అంటే ఇష్టం ఉన్న కూడా చలికాలంలో నెయ్యి తింటే త్వరగా జలుబు చేస్తుందని గొంతు రాసుకుపోతుందని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చలికాలంలో కూడా నెయ్యిని తీసుకోవచ్చట.

నెయ్యి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ నెయ్యి తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. చలికాలంలో కొద్దిగా తింటే జలుబు వస్తుందనే భయం ఉండదు. మార్కెట్లో దొరికే నెయ్యిలో కల్తీలు ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవడం ఉత్తమం. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీర శక్తిని పెంచుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలు లేదా కీళ్ల నొప్పులకు కూడా నెయ్యి ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి నెయ్యి తింటే ఆరోగ్యం బాగుంటుంది.

నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉంచుతాయి. ఫలితంగా అతిగా తినడం నివారించవచ్చు. బరువు కూడా అదుపులో ఉంటుంది. నెయ్యి జీర్ణం కావడం కష్టమని చాలా మంది చెబుతుంటారు. అందుకే చాలామంది నెయ్యితో చేసిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు. రోజూ ఒక చెంచా నెయ్యి తీసుకుంటే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజూ నెయ్యి తింటే, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను దూరం చేసుకోవచ్చు. కాబట్టి నెయ్యిని చలికాలం కూడా ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు.