Acne: వేసవికాలంలో మొటిమల సమస్యను దూరం చేసుకోండిలా..

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా చర్మ సమస్యలు ఎక్కువవుతాయి..

వేసవి కాలం మొదలవుతోంది. ఈ కాలంలో అధికంగా ఉండే ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా చర్మ సమస్యలు ఎక్కువవుతాయి. వేసవిలో చర్మంపై నూనె స్రావాలు ఎక్కువగా ఊరుతాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం జిడ్డుగా మారుతుంది. ఇక.. జిడ్డు చర్మతత్వం ఉన్న అమ్మాయిలు ఈ సీజన్‌లో మరిన్ని తప్పలు పడుతూ ఉంటారు. జిడ్డు కారణంగా మొటిమల (Acne) సమస్య ఇంకా ఎక్కువవుతుంది. ఈ కాలంలో మొటిమల సమస్యను తగ్గించుకోవడానికి అమ్మాయిలు తిప్పలు పడుతూ ఉంటారు. వేసవికాలంలో మొటిమలు (Acne) రాకుండా ఉండాలంటే.. బ్యూటీ కేర్‌తో పాటు, మన డైట్‌లో కొన్ని ఆహారాలు తీసుకోవాలని, కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

ఫైబర్‌ రిచ్‌ డైట్‌ తీసుకోండి:

వేసవి కాలంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే.. శరీరం నుంచి టాక్సిన్స్‌ తొలగుతాయి. మీ చర్మంలో అధికంగా ఉన్న నూనె బయటకు వస్తోంది. దీంతో చర్మం తాజాగా ఉంటుంది. ఈ కాలంలో మొటిమలను నివారించడానికి ఫైబర్‌ అధికంగా ఉండే.. బెర్రీలు, నట్స్, ఓట్స్‌, బార్లీ, ఆపిల్‌, క్యారెట్‌, అవిసె గింజలు, జామకాయ, తృణధాన్యాలు చేర్చుకోండి. ఇవి చర్మంలో వ్యర్థాలు పేరుకోకుండా కాపాడతాయి.

విటమిన్ A:

విటమిన్‌ ఏ చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మంపై మచ్చలు, మొటిమలను తొలగిస్తాయి. విటమిన్ ఎ, కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మం బావుండాలండే కొలాజిన్ చాలా అవసరం. మీ డైట్‌లో బ్రకోలీ, కాలే, పాలకూర, చిలగడ దుంప, క్యారెట్, పాలు, పెరుగు, చీజ్ గుడ్లు, సాల్మన్ చేప, ఆయిలీ చేపలు తీసుకోండి.

జింక్‌:

జింక్‌ మొటిమలు కలిగించే.. బ్యాక్టీరియాతో పోరాడుతుంది. వాటి కార్యకలాపాలను నిరోధిస్తోంది. మీ ఆహారంలో జింక్ అధికంగా ఉండే గుమ్మడికాయ గింజలు, కిడ్నీ బీన్స్, చికెన్, రెడ్‌మీట్‌, బీఫ్‌, సాల్మన్‌ చేపలు, గుడ్లలు తీసుకోండి.

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌:

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేసవిలో మీ చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచుకోవడానికి.. అవిసె గింజలు, చియా సీడ్స్‌, ఫిష్‌ ఆయిల్స్‌ తరచుగా తీసుకోవాలి.

సరిపడా నీళ్లుతాగండి:

సరిపడా నీళ్లు తాగకపోయినా.. చర్మంలో వ్యర్థాలు పేరుకుపోయి మొటిమల సమస్యకు దారి తీస్తుంది. ప్రతి రోజు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. నీళ్లు చర్మంలో పేరుకున్న వ్యర్థాలు, టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. దీంతో మొటిమలు, చర్మ సమస్యలు దూరం అవుతాయి.

వీటికి దూరంగా ఉండండి:

1. ఉప్పు తగ్గించండి

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే.. ఆరోగ్యానికే కాదు, అందానికీ మంచిది కాదు. ఉప్పులో ఉండే.. అయోడిన్‌ మొటిమలను ప్రేరేపిస్తుంది. వేసవిలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే.. మొటిమల సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

2. ఫ్రైడ్‌ ఫుడ్‌ దూరం పెట్టండి

కరకరలాడే సమోసాలు, ఫ్రెంచ్‌ ఫ్లైస్‌, పకోడీలంటే ఇష్టముండని వారుండరు. అయితే, ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ను పెంచడమే కాకుండా రక్త ప్రసరణను దెబ్బతీస్తాయి. దీంతో మొటిమల సమస్య తీవ్రం అవుతుంది.

3. ప్రాసెస్‌ చేసిన ఆహారం వద్దు

సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాలు చర్మంపై సెబమ్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది మొటిమలకు కారణమవుతుంది. అందుకే సోడాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, క్రిస్పీ ఫుడ్స్, సాల్టీ, ఫ్యాట్ ఫుడ్స్, స్వీట్స్‌ తినకపోవడమే మంచిది.

Also Read:  Cough: కఫం దగ్గు.. పొడి దగ్గు తగ్గించే ఇంటి చిట్కాలు