Site icon HashtagU Telugu

Asthma: ఆస్తమాతో బాధ పడుతున్నారా.. ఈ కివి పండుతో దూరం!

Kiwi Fruit

Kiwi Fruit

కివీ కాయలు చూడటానికి ముదురు గోధుమ రంగు జూలుతో కోడి గ్రుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక గింజలతో నిండిన ఆకు పచ్చని లేదా పసుపు పచ్చని గుజ్జు కలిగివుంటుంది. అయితే ఇంతకుముందు ఈ కివి ఫ్రూట్స్ అనేవి మార్కెట్లో చాలా తక్కువగా లభించేవి. కానీ రాను రాను కివి ఫ్రూట్స్ కూడా మార్కెట్లో విరివిగా లభించడం మొదలుపెట్టాయి. ఈ కివి ఫ్రూట్ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కమల పండుకు రెట్టింపు విటమిన్‌ సి ఆపిల్‌లోకన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలు ఇందులో ఉన్నాయి. కివి ఫ్రూట్ లో పీచు పదార్థం, విటమిన్‌ ఇ, పొటాషియం, ఫోలిక్‌ యాసిడ్‌, కెరోటినాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాల నిలయం అని చెప్పవచ్చు.

కివి పండు బరువును తగ్గిస్తుంది. అలాగే జిర్ణ వ్యవస్థ ను శుభ్రం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరిగేలా చేస్తుంది. రక్త పోటును కూడా తగ్గిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. కివి పండులో ఉండే విటమిన్ ఈ, విటమిన్ సి కళ్లకు ఇటువంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి. అంతేకాకుండా ఈ కివి పండ్లు గుండెను రక్షిస్తాయి.

కివి పండు డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది. అదేవిధంగా ఆస్తమాను కూడా తగ్గిస్తుంది. ఆస్తమా సమస్యతో ఎక్కువగా బాధపడేవారు ఈ కివి ఫ్రూట్ తినడం వల్ల ఎంతో మంచిది. కివి ఫ్రూట్ బరువును కూడా తగ్గిస్తుంది. మలబద్ధకం నివారణకు ఉపయోగపడుతుంది. దీనిలో పీచు అధికంగా ఉంటుంది. కొన్ని రకాల జన్యు మార్పులును నివారిస్తుంది. క్యాన్సర్ సమస్యను నివారిస్తుంది. కంటి సంబంధించిన సమస్యలను నివారిస్తుంది.