Sweet Potato : చిలగడదుంపతో మచ్చలేని మెరిసే చర్మం సొంతం చేసుకోండిలా?

చిలగడదుంప (Sweet Potato)లో బీటా కెరోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ గా కూడా పనిచేస్తుంది.

  • Written By:
  • Publish Date - December 2, 2023 / 06:20 PM IST

Sweet Potato Tips : చిలగడదుంప వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలుస్తుంది. కొందరు వీటిని ఉడకబెట్టుకొని తింటే మరి కొంతమంది పచ్చిగానే తింటూ ఉంటారు. ఇంకొందరు చిలగడదుంప (Sweet Potato)తో కూరలు కూడా చేసుకుని తింటూ ఉంటారు. అయితే చిలగడదుంప కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందరికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్న విషయం చాలామందికి తెలియదు. సౌందర్య పోషణకు చిలగడదుంప (Sweet Potato) ఎంతో బాగా సహాయపడుతుంది. మరి చిలగడదుంప చర్మానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

కాగా చిలగడదుంప (Sweet Potato)లో బీటా కెరోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ గా కూడా పనిచేస్తుంది. విటమిన్‌ ఏ సూర్యరశ్మి కారణంగా చర్మకణాలు దెబ్బతినకుండా రక్షిస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా రక్షిస్తుంది.​ కాగా బీటా కెరోటిన్ రిచ్ ఫుడ్స్ తరచూ తీసుకుంటూ ఉండటం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. అలాగే చిలగడదుంప లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌ని తగ్గిస్తాయి. దీర్ఘకాలిక చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. చిలగడదుంపలోని విటమిన్‌ ఏ ముడతలు, పొడి చర్మాన్ని నివారించడానికి సహాయపడుతుంది. మీరు మృదువైన, యవ్వనంగా చర్మం సొంతం చేసుకోవాలనుకుంటే..

మీ డైట్‌లో చిలగడదుంపను కచ్చితంగా చేర్చుకోవాలి. చిలగడదుంపలోని యాంథోసైనిన్స్‌కు యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఈ గుణాలు నల్ల మచ్చలు, పొక్కులను నివారిస్తాయి. చిలగడదుంపలో క్యాన్సర్ నిరోధక గుణాలు కూడాం ఉన్నాయి. చిలగడదుంపలోని బీటా కెరోటిన్ జుట్టు రాలడం, పల్చబడటాన్ని తగ్గిస్తుంది. చిలగడదుంపలో విటమిన్‌ ఏ, సి తోపాటుగా విటమిన్‌ బీ కాంప్లెక్స్‌, విటమిన్‌ ఇ, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు కేశ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Also Read:  Reverse Walking : వామ్మో.. రివర్స్ వాకింగ్ వల్ల ఏకంగా అన్ని ప్రయోజనాలా?