200 Vaccine Shots : 217 సార్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు.. ఏమైందో తెలుసా?

200 Vaccine Shots : కొందరికి జాగ్రత్త ఎక్కువ.. ఇంకొందరికి అతిజాగ్రత్త ఎక్కువ.. జర్మనీకి చెందిన ఓ వ్యక్తి అతిజాగ్రత్త కేటగిరీకి చెందినవాడు.

  • Written By:
  • Updated On - March 6, 2024 / 04:16 PM IST

200 Vaccine Shots : కొందరికి జాగ్రత్త ఎక్కువ.. ఇంకొందరికి అతిజాగ్రత్త ఎక్కువ.. జర్మనీకి చెందిన ఓ వ్యక్తి అతిజాగ్రత్త కేటగిరీకి చెందినవాడు. అతగాడు అతి జాగ్రత్తకుపోయి ఏకంగా 200 సార్లకుపైగా వ్యాక్సిన్లు వేయించుకున్నాడు. ఆ వ్యక్తిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

జర్మనీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 217 సార్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఇది అనధికారిక సమాచారం. జర్మనీ ప్రభుత్వ సమాచారం ప్రకారం.. అతడు 134 సార్లు కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నాడు. ఈ విషయం గురించి తెలియగానే ఎర్లాంగెన్‌-నర్న్‌బర్గ్‌లోని ఫ్రెడ్రిక్‌ అలగ్జాండర్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం అతడిని కాంటాక్ట్ అయింది. ఇంత భారీ సంఖ్యలో ఎగబడి మరీ వ్యాక్సిన్లు వెసుకున్న తర్వాత అతడి రోగ నిరోధక శక్తికి ఏమైంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తి శరీరంపై రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటిలో గుర్తించిన వివరాలతో కూడిన ఆసక్తికర నివేదిక ‘లాన్సెట్‌ జర్నల్‌’లో పబ్లిష్ అయింది.

Also Read :Chakshu Portal: స్పామ్ కాల్స్‌, సందేశాలను అరికట్టడానికి కొత్త‌ పోర్టల్‌ను ప్రారంభించిన ప్ర‌భుత్వం..!

లాన్సెట్ నివేదిక ప్రకారం.. భారీ సంఖ్యలో కరోనా వ్యాక్సిిన్లు తీసుకున్నందు వల్ల జర్మనీకి చెందిన ఆ వ్యక్తి శరీరంలో కరోనా వైరస్‌పై పోరాడగల టీ-సెల్స్ (తెల్లరక్త కణాలు) ఎక్కువ సంఖ్యలో తయారైనట్లు స్టడీలో వెల్లడైంది. సాధారణంగానైతే ఎక్కువ సంఖ్యలో కరోనా వ్యాక్సిన్లు తీసుకుంటే.. మన శరీరంలోని తెల్లరక్తకణాలు అలసిపోతాయి. వాటి నుంచి విడుదలయ్యే ప్రొ-ఇన్‌ఫ్లమేటరీ పదార్థాల మోతాదు తగ్గిపోతుంది. కానీ ఈ వ్యక్తి శరీరంలో అందుకు పూర్తి భిన్నంగా తెల్లరక్తకణాలు ఏ మాత్రం అలసిపోలేదు. యాక్టివ్‌గానే ఉన్నాయి. అవి సమర్థంగానే పనిచేస్తున్నాయి. వ్యాక్సిన్లు కుప్పలుకుప్పలుగా తీసుకున్నా..  ఆ వ్యక్తి  రోగ నిరోధక శక్తి కొంతకూడా  బలహీనపడలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

Also Read :Raebareli: ఈసారి రాయబరేలి నుంచి ఎవరు పోటీ ?

కరోనా కేసులు ప్రస్తుతం తగ్గినప్పటికీ లాంగ్‌ కొవిడ్‌ ముప్పు ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.కరోనాపై చేసిన పలు పరిశోధనలలో సార్స్‌- కోవ్‌-2 వైరస్ దీర్ఘకాలంలో హాని కలిగిస్తుందని తేలింది. దీని దుష్ప్రభావాలు గుండె, ఊపిరితిత్తులపై ఉంటాయని వెల్లడయ్యింది.ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన వివరాల ప్రకారం.. కరోనా ఇన్‌ఫెక్షన్‌ బారిన పడిన బాధితులలో చాలా మంది వ్యాధి నుంచి కోలుకున్నాక వారిలో జ్ఞాన సామర్థ్యం(ఐక్యూ) తగ్గిపోతున్నదని పరిశోధనల్లో తేలింది. నిపుణుల బృందం కోవిడ్-19 నుండి కోలుకున్న వారిలో ఒక ఏడాది తర్వాత వారి ఐక్యూ స్థాయిలో మూడు పాయింట్ల తగ్గుదలను కనుగొంది. ఇది మెదడు సంబంధిత ముప్పుపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని నిపుణులు అంటున్నారు. మెదడు పనితీరులో తగ్గుదల జీవన నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు తెలిపారు. ఈ అధ్యయనాలు కరోనా కారణంగా మెదడు సంబంధిత సమస్యల ముప్పును తెలియజేశాయి.

Also Read : Mamata Banerjee: అంగ‌న్‌వాడీ, ఆశా వ‌ర్క‌ర్ల‌ జీతాలు పెంపు..ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి