ప్రస్తుత రోజుల్లో ఎక్కువ శాతం మంది బాధపడుతున్న సమస్యలలో గ్యాస్, అజీర్తి సమస్య కూడా ఒకటి. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. కడుపులో గ్యాస్ అజీర్తి కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఈ కారణంగా నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతుంటారు. వీటి కోసం ఎన్నో రకాల మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సమస్య తగ్గకపోతే ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి అందుకోసం ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపులో గ్యాస్ స్థాయిలను సమతులన చేస్తుందట. ఇది నేచురల్ యాంటిసిన్ అని కూడా చెప్పవచ్చు. కాగా అరటిపండును తీసుకోవడం వల్ల కడుపులో అజీర్తి సమస్య ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయట. పరగడుపున ఉదయం అరటిపండు తీసుకోవాలట. ఇది కడుపులో గ్యాస్ సమస్యను తగ్గిస్తుందని, అయితే పచ్చి అరటికాయలు మాత్రం గ్యాస్ ఉన్న వారు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కడుపు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు వాము తినడం మంచిది అని చెబుతున్నారు. ఇది గ్యాస్టిక్ సమస్యలకు మంచి రెమిడీగా పనిచేస్తుంది. చిన్న వారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ వామును తినవచ్చు. ఇది కడుపులో యాసిడ్ ను తగ్గిస్తుంది. కాబట్టి ఒక స్పూన్ వామును తీసుకొని అందులో కాస్త ఒక నల్ల ఉప్పు కూడా కలిపి గోరు వెచ్చని నీళ్లలో వేసుకొని తీసుకోవాలట.
నిమ్మకాయ రసంలో తేనె వేసుకొని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం బాగుంటుందట. కడుపులో పిహెచ్ స్థాయిలు సమతుల్యం చేస్తుందట. నిమ్మ, తేనె కలిపి మంచి ఉపశమనం కల్పించే గుణాలు కలిగి ఉంటుందని, ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు ఒక అరచెక్క నిమ్మరసం ఒక చెంచా తేనెను వేసుకొని తీసుకోవడం వల్ల కడుపుకి సంబంధించిన సమస్యలు నయం అవడంతో పాటు అధిక బరువు సమస్యతో కూడా చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు. అల్లం టీ లో యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుందట. అల్లం ముక్కలుగా కట్ చేసి మరగపెట్టి అందులో కాస్త తేనె వేసుకుని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ తగ్గిపోతుందట. అలాగే చాలామందికి భోజనం చేసిన తర్వాత కాస్త సోంపు గింజలు నమిలే అలవాటు కూడా ఉంది. సోంపు కడుపు సమస్యలను తగ్గిస్తుందట. ఇది గ్యాస్ ని నివారించే గుణం కలిగి ఉంటుందని, భోజనం చేసిన ప్రతిసారి ఒక చెంచా సోంపు గింజలు నమలడం అలవాటు చేసుకోవాలని, ఉదయం పరగడుపున సోంపుతో టీ తయారు చేసుకొని కూడా తాగవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.