Site icon HashtagU Telugu

Swollen Foot: పాదాల వాపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ నూనె అప్లై చేయాల్సిందే!

Swollen Foot

Swollen Foot

మామూలుగా ఎక్కువసేపు ఒకే చోట కూర్చున్నప్పుడు కానీ నిలుచున్నప్పుడు కానీ మనకు పాదాల వాపు రావడం అన్నది సహజం. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి మార్కెట్ లో దొరికే రకరకాల ఆయింట్మెంట్లు, స్ప్రేలు, క్రీములు, వాడుతూ ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు మంచి ఫలితాలు కనిపించవు. అయితే పాదాల వాపుని మన ఇంట్లో కూడా దొరికే కొన్ని రకాల పదార్థాలతో తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా ఎక్కువ సేపు కూర్చోవడం, నిల్చోవడం, కీళ్ల నొప్పులు తదితర సమస్యలతో పాదాలు వాపు వస్తుంటాయి. పాదాల వాపు తగ్గడానికి చాలామంది రకరకాల నూనెలు ట్రై చేస్తూ ఉంటారు.

కానీ వాపు తగ్గడానికి వెల్లుల్లి నూనె బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. పాదాలవాపు తగ్గించడంలో వెల్లుల్లి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందట. వెల్లుల్లి లోని ఔషధ గుణాలు వాపును తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయట. అంతేకాదు వెల్లుల్లి నూనె చర్మానికి పోషణను అందించి, పాదాలను మృదువుగా, ఆరోగ్యంగా చేస్తుందని చెబుతున్నారు. వెల్లుల్లిలో అలెర్జీ నిరోధక, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. దీనిలోని అల్లిసిన్ అనే సమ్మేళనం వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుందట. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందట. వాపు ఉన్న పాదాలకు వెల్లుల్లి నూనెతో మసాజ్ చేస్తే కండరాలు సడలి, అలసట తగ్గుతుందట. ఎక్కువ సేపు నిల్చున్నప్పుడు ఈ నూనెను ఉపయోగించవచ్చని చెబుతున్నారు. వెల్లుల్లిలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఫంగల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.

ఈ వెల్లుల్లి నూనె ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా వెల్లుల్లి రెబ్బలు 15, కొబ్బరి నూనె లేదా ఆవ నూనె 1 కప్పు, పసుపు 1 స్పూన్ తీసుకోవాలి. ఒక పాత్రలో నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో తరిగిన వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లి లేత గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. దీనికి పసుపు కూడా కలపాలి. వెల్లుల్లి రంగు బాగా మారిన తర్వాత, దాన్ని వడకట్టి చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక గాజు సీసాలో పోసి అవసరమైనప్పుడు ఉపయోగించాలి. వాపు ఉన్న దగ్గర వెల్లుల్లి నూనెను బాగా రాయండి. తర్వాత చిన్నగా మసాజ్ చేయాలి. 10 నుంచి 15 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత దానిపై ఒక క్లాత్ కప్పాలి. పాదాలను కొంతసేపు పైకి లేపి ఉంచాలి. ఇలా చేయడం వల్ల వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది. రోజుకు రెండుసార్లు ఈ నూనెను పెట్టుకోవచ్చని ఇలా చేస్తే తొందరగా పాదాల వాపు తగ్గుతుందని చెబుతున్నారు.