వెల్లుల్లి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వెల్లుల్లిని ఉపయోగించి ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి వంట గదిలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది. ఈ వెల్లుల్లిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇది ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. చాలామంది వెల్లుల్లి తినడానికి అంతగా ఇష్టపడరు. కూరల్లో వచ్చినా కూడా తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కానీ వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అలా అస్సలు చేయరు.
వెల్లుల్లి ఎముకల నిర్మాణంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే గొంతుకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. చలికాలంలో పచ్చి వెల్లుల్లిని తినేవారికి జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు 63 శాతం తగ్గుతాయట. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. వెల్లుల్లిలో మెగ్నీషియం, కాల్షియం, జింక్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయట. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. యూరిక్ యాసిడ్, కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మీరు రాత్రి పడుకునేటప్పుడు రెండు వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి ఉదయం తినాలి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీకు ఏదైనా అలెర్జీ సమస్య ఉంటే, ఏదైనా మందులు తీసుకుంటే, మీరు తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున తినే వారు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా వెల్లుల్లి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వెల్లుల్లి తరచుగా తినడం అలవాటు చేసుకోవడం మంచిది.