Site icon HashtagU Telugu

Gaddi chamanthi: గడ్డి చామంతి వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం?

Former South Africa player

Safeimagekit Resized Img (2) 11zon

గడ్డి చామంతి.. ఈ మొక్క పల్లెటూర్లలో ఎక్కడ చూసినా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. పొలాల గట్ల ప్రాంతంలో మైదాన ప్రాంతాల్లో ఈ మొక్క గుబురుగా పెరుగుతూ ఉంటుంది. పొదుపురుగుడు కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆకులు దీర్ఘ అండకారంలో ప్రస్తుతపు రంప పంచులు కలిగి ఉంటాయి. చాలామంది ఈ మొక్కను పిచ్చి మొక్క అనుకోని తీసేస్తూ ఉంటారు. కానీ గడ్డి చామంతి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. అంతేకాకుండా ఈ మొక్కను తీసుకొని మరి వచ్చి ఇళ్లలో పెంచుకోవడం ఖాయం. మరి ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే..

గడ్డి చామంతిలో ఆల్కలాయిడ్లు, లేవనాయిడ్లు ఆయిల్ తో పాటు సోడియం, పొటాషియం, కాల్షియం అధికంగా ఉన్నాయి. గడ్డి చామంతి ఆకులకు యాంటీసెప్టిక్ లక్షణం ఉంది. గాయాలైన తెగిన దీని ఆకులు నలిపి రసం తీసి గాయం ఉన్నచోట లేపనంగా పూస్తే రక్తస్రావం ఆగడంతో పాటు అవి త్వరగా నయం అవుతాయి. అలాగే దీని ఆకుల రసం ఆయాసం దగ్గు జలుబు వంటి సమస్యలకు మంచి ఔషధం లాగా పనిచేస్తుంది. గడ్డిచామంతా ఆకుల రసం గుంటగలగరాకు రసం నల్లనవ్వుల నూనెలను సరిసమానంగా కలిపి నూనె మిగిలే వరకు సన్నని సెగ పైన వేడి చేసి ఆ మిశ్రమాన్ని తలమాడుకు పట్టిస్తుంటే జుట్టురాలే సమస్య తగ్గి కురులు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతాయి. గడ్డి చామంతా ఆకుకు షుగర్ కంట్రోల్ చేసే గుణం ఉంది.

ఈ మొక్కలో ఉన్న జోలిలోని రసాయనం కారణంగా మధుమేహం వ్యాధిని నియంత్రించవచ్చు. దీని ఆకుల రసాన్ని చర్మ వ్యాధులు ఉన్నచోట లేపనంగా పూస్తే మంచి ఫలితం ఉంటుంది. దీని ఆకులను ఎండబెట్టి పొగ వేస్తే దోమలు పారిపోతాయి. దీని ఆకులను నూరి ముద్దగా చేయాలి. దీన్ని మొలలపై అప్లై చేసే పడుకోవాలి. ఉదయం లేవగానే కడుక్కుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మొలల సమస్య పోతుంది. నడుము నొప్పిని ఈ మొక్క తగ్గిస్తుంది. అందుకు ఈ మొక్కలో ఉండే ఆంటీ ఇంప్లమెంటరీ లక్షలమే కారణం. ఈ మొక్క మొత్తం భాగం అంటే ఆకులు వేర్లు, కాండం, పువ్వులు మొత్తం సేకరించి శుభ్రంగా కడిగి దంచి మెత్తటి పేస్టులా చేయాలి.

Exit mobile version