పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే వైద్యులు కూడా తరచుగా పండ్లు తీసుకోవాలని చెబుతూ ఉంటారు. వీటి వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు విటమిన్లు అందుతాయి. అంతేకాకుండా పలు రకాల ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చని చెబుతున్నారు. అయితే పండు తినడం ఆరోగ్యానికి మంచిదే అలాగే ఉదయాన్నే కొన్ని రకాల పండ్లు తింటే ఆరోగ్యానికి ఇంకా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఉదయాన్నే తీసుకోవాల్సిన ఆ పండ్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ఉదయాన్నే తీసుకోవాల్సిన పండ్లలో పుచ్చకాయ కూడా ఒకటి. ఈ పండులో మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు మెండుగా ఉంటాయి.
ఉదయాన్నే పుచ్చకాయ తినడం వల్ల ఆశ్చర్యానికి అవసరమైన ద్రవాలు అందుతాయి. డీ హైడ్రేషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పుచ్చకాయ శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. వేసవికాలంలో పుచ్చకాయను పరగడపున తీసుకుంటే ఇంకా మంచిదని చెబుతున్నారు. అలాగే బొప్పాయి పండును కూడా ఉదయం పరిగడుపున తినవచ్చని చెబుతున్నారు. బొప్పాయిని ఉదయాన్నే తినడం వల్ల జిర్ణక్రియ మెరుగుపడడంతో పాటు మలబద్ధకం జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే బొప్పాయిని డైట్ లో చేర్చుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
అలాగే ఉదయాన్నే తినవలసిన పండ్లలో యాపిల్ పండు కూడా ఒకటి. ఫైబర్,సహజ చక్కెరలు పుష్కలంగా ఉండే ఆపిల్ పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఈ పండు మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే ఉదయాన్నే కివి పండ్లు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందట. కివీ పండ్లు విటమిన్ సి కి అద్బుతమైన వనరులు. ఈ పండ్లను తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఉదయాన్నే పరగడుపున కివీలను తినడం వల్ల కూడా జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు.
note: పైన ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యులు సలహా తీసుకోవడం మంచిది.