వేసవికాలంలో ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం కావాలి అంటే తినే ఆహార పదార్థాల విషయంలో చాలా రకాల జాగ్రత్తలు పాటించాలి. సరైన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడే ఆరోగ్యంతో పాటు చర్మం కూడా బాగుంటుంది. మరి వేసవి కాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. పుచ్చకాయ.. ఇందులో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా మారుతుందట. ఈ పుచ్చకాయలో విటమిన్ ఏ, సీ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలాజిన్ ప్రొడక్షన్ లో సహాయం చేస్తాయని, మనం యవ్వనంగా కనిపించేలా చేస్తాయని చెబుతున్నారు.
వేసవికాలం బొప్పాయి తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయట. దీనిలో విటమిన్ ఏ, సీ, ఈ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన చర్మంలోని డెడ్ సెల్స్ ని ఎక్స్ఫోలియేట్ చేస్తాయట. చర్మం యవ్వనంగా కనిపించడంలో సహాయం చేస్తాయని చెబుతున్నారు. అలాగే బెర్రీస్ లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయట. ఇవి కూడా డెడ్ సెల్స్ ని రిపేర్ చేయడంలో,సెల్ రీజెనరేట్ చేయడంలో సహాయం చేస్తాయట. వీటిని తినడం వల్ల మన చర్మం ఆరోగ్యకరంగా, యవ్వనంగా కనపడేలా చేస్తాయట.
అలాగే నారింజ పండ్లలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుందట. ఇది కూడా మన చర్మంలో కొలాజిన్ ప్రొడక్షన్ ని మెరుగుపరచడంలో సహాయం చేస్తుందట. సూర్య రశ్మి వల్ల కలిగిన డ్యామేజ్ ని తగ్గించడంలోనూ చర్మం మెరుస్తూ కనిపించేలా చేస్తుందట. మనం యవ్వనంగా కనిపించాలంటే విటమిన్ సి చాలా అవసరం అని,అది ఆరెంజెస్ లో పుష్కలంగా ఉంటుందని చెబుతున్నారు. కివి పండ్లలో విటమిన్ సీ, ఈ పుష్కలంగా ఉంటాయట. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా స్కిన్ డ్యామేజ్ ని రిపేర్ చేయడంలో సహాయం చేస్తాయని చెబుతున్నారు.
చర్మం సాగినట్లుగా అవ్వకుండా చర్మంపై ముడతలు రాకుండా నివారించడంలో కివి పండు కీలక పాత్ర పోషిస్తుందట. పైనాఫిల్ కూడా మన అందాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందట. చర్మంలో కూడా డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించడానికీ, చర్మాన్ని ఎక్కువ కాలం మెరిసేలా చేయడంలో పైనాపిల్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా పండ్లలో రారాజు అయిన మామిడి పండు కూడా ఈ సీజన్ లో మన అందాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందట. ఎందుకంటే మామిడి పండ్లలోనూ విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయట. ఇవి కొలాజిన్ ప్రొడక్షన్ ని పెంచడానికీ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి, వయసు పెరగడాన్ని ఆపడంలోనూ యవ్వనంగా కనిపించేలా చేయడంలోనూ సహాయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.