Site icon HashtagU Telugu

Fruits: ఫ్రూట్స్ షెల్ఫ్ లైఫ్.. సులభమైన చిట్కాలు ఇవిగో

Fruits For Diabetes

Fruits Shelf Life.. Here Are Some Easy Tips

ప్రతి ఫ్రూట్ (Fruits) కు ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. పరిసరాల ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులను బట్టి ఫ్రూట్స్ (Fruits Self Life) షెల్ఫ్ లైఫ్ మారుతూ ఉంటుంది.. ఒక్కో ఫ్రూట్ షెల్ఫ్ లైఫ్ (Fruits Self Life) ఒక్కోలా ఉంటుంది. మనం ఎక్కువగా తినే కొన్ని ఫ్రూట్స్ (Fruits) ఎంతకాలం పాటు నిల్వ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

యాపిల్

తాజా యాపిల్స్ ఒక వారం వరకు మంచిగా ఉండగలవు. మీరు వాటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తే, ఒక నెల తర్వాత కూడా తినొచ్చు. ఈ వ్యవధిలో మీరు తినగలిగే వాటికంటే ఎక్కువ సంఖ్యలో యాపిల్స్ ఉంటే.. వాటితో రుచికరమైన డెజర్ట్‌లను తయారు చేసుకోవచ్చు.

సిట్రస్ ఫ్రూట్స్

నారింజ వంటి సిట్రస్ పండ్లు సుదీర్ఘ షెల్ఫ్ లైఫ్ కలిగి ఉంటాయి. ఇవి సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. రిఫ్రిజిరేటర్‌లోనైతే ఒక నెల వరకు నిల్వ ఉంటాయి.నారింజను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం మంచిది కాదు. ఫ్రిజ్ లో ఉంచితే
నారింజ పండ్లలోని నీరు ఇంకిపోయి ,వాటిని పొడిగా మారుస్తుంది.

అరటిపండు

అరటిపండ్లు 3-4 రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అవి పక్వానికి వచ్చిన తరువాత తడిగా మరియు నలుపు రంగులోకి మారుతాయి.  అరటిపండు బయటి తొక్క రంగు మారడాన్ని మీరు గమనించడం ప్రారంభించినప్పుడు ..దాన్ని అదే రోజు తినాలి. కానీ అరటిపండు ఆకుపచ్చ రంగులో ఉంటే.. అది పక్వానికి రావడానికి ఒక వారం పడుతుంది. అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచకూడదని గుర్తుంచుకోండి.

ద్రాక్ష

ద్రాక్ష పండ్లను 1-2 వారాల పాటు నిల్వ చేయొచ్చు. ముదురు గోధుమ రంగులోకి అవి మారితే పండాయని అర్ధం చేసుకోవచ్చు.

పుచ్చకాయలు

వేసవి వచ్చిందంటే మనకు ఇష్టమైన పుచ్చకాయలు మార్కెట్లోకి వస్తాయి. వాటిని ఒక వారం వరకు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయొచ్చు. పుచ్చకాయలను చిన్నగదిలో నేలపై నిల్వ చేయొచ్చు.

పియర్స్

పియర్స్ జామ జాతికి చెందిన ఫ్రూట్. అది ఇంకా పండకపోతే మీరు రెండు రోజులు బహిరంగ ప్రదేశంలో ఉంచవచ్చు. కానీ అవి పండిన తర్వాత.. వాటిని వెంటనే రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి . ఫ్రిజ్ లో మరో 15 రోజులు అవి బాగానే ఉంటాయి.

బెర్రీలు

అన్ని రకాల బెర్రీలు దాదాపు ఒకే రకమైన షెల్ఫ్ లైఫ్ ను కలిగి ఉంటాయి. మీరు వాటిని ఎప్పుడూ చిన్నగదిలో నిల్వ చేయకూడదు.  బెర్రీలను ఎల్లప్పుడూ ఫ్రిజ్ లో ఉంచాలి. వాటిని ఇతర ఆహారాలకు, ఇతర ఫుడ్స్ కు దూరంగా ఉంచాలి.  ఈ విధంగా అవి మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి.

పైనాపిల్

పైనాపిల్ ను మీరు 2-3 రోజుల పాటు గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయొచ్చు. కానీ మీరు దానిని కత్తిరించిన తర్వాత ఫ్రిజ్ లో నిల్వ చేయాలి.పైనాపిల్ ఫ్రిజ్ లో ఒక వారం పాటు నిల్వ ఉంటుంది.

Also Read:  Vangaveeti Radha: లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న వంగవీటి రాధా