అధిక పొట్ట అలాగే అధిక బరువు సమస్యతో ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు రకాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక పొట్ట తగ్గించుకోవడం కోసం అధిక బరువు తగ్గించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఫలితం మాత్రం అసలు కనిపించవు. అటువంటి వారు ఇప్పుడు చెప్పబోయే ఫ్రూట్ జ్యూస్ లు తీసుకుంటే తప్పనిసరిగా మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో మనకు ఎక్కడ చూసినా కూడా పుచ్చకాయలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పుచ్చకాయలు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అన్న విషయం మన అందరికీ తెలిసిందే. పుచ్చకాయను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే పుచ్చకాయ మనకు వేసవికాలంలో మాత్రమే ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. పుచ్చకాయ జ్యూస్ ను తాగితే మీరు హైడ్రేట్ గా ఉండటమే కాకుండా మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా కూడా ఉంటుంది.అలాగే ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. పైనాపిల్ జ్యూస్ కూడా అధిక బరువును తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందట. ఈ పండులో బ్రోమెలైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణ క్రియకు ఎంతో బాగా ఉపయోగపడుతుందట.
అదేవిధంగా ఉపరాన్ని తగ్గించి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. దానిమ్మ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. రోజూ ఒక దానిమ్మ పండును తింటే ఒంట్లో రక్తం పుష్కలంగా ఉంటుందట. ఆరోగ్యం కూడా బేషుగ్గా ఉంటుందట. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని, దానిమ్మ రసాన్ని తాగితే ఆకలి బాధలు తగ్గిపోతాయని అలాగే బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుందని చెబుతున్నారు. బరువును తగ్గించడంలో, బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో నిమ్మరసం చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట. మీరు నిమ్మరసాన్ని రోజూ తాగితే ఇది డిటాక్సిఫైయర్ గా పనిచేసి కడుపులో పేరుకుపోయిన చెడు కొవ్వులను కరిగిస్తుందని, అలాగే కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుందని చెబుతున్నారు. అలాగే ద్రాక్షరసంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయట. ముఖ్యంగా ఈ ద్రాక్షరసంలో మన శరీరంలో కొవ్వును కరిగించే లక్షణాలు మెండుగా ఉంటాయట. మీరు ఈ జ్యూస్ ను తాగినా ఈజీగా బరువు తగ్గుతారని చెబుతున్నారు.