Site icon HashtagU Telugu

Summer Tips: వేసవిలో పదేపదే ఆ సమస్య వేధిస్తోందా.. దాని లక్షణం ఇదే కావచ్చు!

Summer Tips

Summer Tips

వేసవికాలంలో చాలా రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిలో మూత్ర సమస్య కూడా ఒకటి. పదేపదే మోతుడానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. శరీరం నీటి శాతాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చలికాలం కంటే వర్షాకాలం కంటే వేసవి కాలంలోనే మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తూ ఉంటారు.
కొందరికి బయట ఎండలో పని చేసే వారికి చెమట రూపంలో నీరు బయటకు వెళ్తే ఇంటిపట్టునే ఉండే వారికి తరచుగా మూత్రం వస్తూ ఉంటుంది. అయితే ఇలా రావడం అనేది సాధారణంగా కనిపించే సమస్య కావచ్చు.

అయితే, ఇది కొన్ని ఆరోగ్య సమస్యల సూచన కూడా కావచ్చని చెబుతున్నారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుందట. ఇది మూత్రాన్ని సాంద్రీకృతం చేసి, మూత్రాశయంలో చికాకును కలిగిస్తుందని చెబుతున్నారు. ఫలితంగా తరచూ మూత్రవిసర్జన అవసరం పడుతుందట. వెచ్చని వాతావరణం బ్యాక్టీరియా వృద్ధికి అనుకూలంగా ఉంటుందట. ఇది మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందట. దీని వల్ల తరచూ మూత్ర విసర్జనతో పాటు మంట లేదా నొప్పి కూడా రావచ్చని చెబుతున్నారు.

అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేనప్పుడు, దాహం ఎక్కువగా వేయడం, తరచూ మూత్ర విసర్జన చేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయట. ఇది మధుమేహం యొక్క సూచన కావచ్చని చెబుతున్నారు. వేడి వాతావరణం కొన్నిసార్లు మూత్రాశయం m సున్నితత్వాన్ని పెంచుతుందట. దీని వల్ల తరచూ మూత్రవిసర్జనకు ఉత్తేజం కలుగుతుందట. మూత్ర పిండ రాళ్లు లేదా ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు తరచూ మూత్రవిసర్జనకు కారణమవుతాయట. ఇవి సాధారణంగా నొప్పి లేదా అసౌకర్యంతో కూడి ఉంటాయని చెబుతున్నారు. తరచూ మూత్రవిసర్జన సమస్యను నివారించడానికి నీటి లోపం రాకుండా చూసుకోవాట. రోజూ తగినంత నీటిని తాగడం చాలా ముఖ్యం. ఇది మూత్రాశయ ఆరోగ్యాన్ని కాపాడుతుందట. కెఫీన్ మద్యం మూత్రాశయంపై ఒత్తిడిని పెంచుతాయి, కాబట్టి వీటిని అతిగా తీసుకోవడం మానుకోవాలట. కాగా తరచూ మూత్రవిసర్జనతో పాటు మంట, నొప్పి, లేదా మూత్రంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలట.

Exit mobile version