మామూలుగా మనము ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా రకరకాల టిఫిన్స్ వంటివి తింటూ ఉంటాం. దోస, ఇడ్లీ, పూరి, పొంగల్ ఉగ్గాని, ఉప్మా వంటివి తింటూ ఉంటారు. వీటికి బదులుగా కొంతమంది ఓట్స్ అలాగే కొంతమంది ఫ్రూట్స్ మిల్క్ వంటివి కూడా తాగుతూ ఉంటారు. అయితే ఇవి తినలేని వారు ఉదయం పూట ఇప్పుడు చెప్పినట్టుగా గుప్పెడు శనగలు తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శెనగలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందట. ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, విటమిన్లు,మనరల్స్ పుష్కలంగా ఉంటాయట. కాగా శెనగలు మీ శరీరాన్ని శక్తివంతం చేయడమే కాకుండా అనేక వ్యాధుల నుండి కూడా కాపాడుతుందట.
ప్రస్తుత రోజుల్లో జీర్ణ సంబంధిత సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. అయితే నానబెట్టిన శెనగలు దీనికి చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయట. ఇందులో అధిక మొత్తంలో ఉండే ఫైబర్ మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుందట. పేగు కదలికలను సులభతరం చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, ఆహారం సక్రమంగా జీర్ణం కావడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయని, ఆరోగ్యం మెరుగుపడుతుంది అని చెబుతున్నారు. అలాగే షుగర్ అనేది ప్రస్తుత కోట్ల మందిని వేధిస్తున్న ఒక సమస్య. అలాంటి నానబెట్టిన శనగపప్పు బ్లడ్ లో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుందట. దీనిలో గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుందట.
దాని వల్ల చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయట. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన ఆహారం అని చెబుతున్నారు. బరువు తగ్గడంలో సాయం నానబెట్టిన శనగలు బరువు తగ్గడానికి సహాయపడుతుందట. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుందట. దీనివల్ల మీరు తరచుగా తినాలనే కోరికను నియంత్రించవచ్చని, అదనపు కేలరీలు తీసుకోకుండా ఉండవచ్చని చెబుతున్నారు. రోగనిరోధక శక్తి మనల్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. నానబెట్టిన శనగలలో ఐరన్, భాస్వరం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన మినరల్స్, విటమిన్లు ఉంటాయట.
ఇవి శరీరంలోని రోగనిరోధక కణాలను బలోపేతం చేస్తాయని, తద్వారా శరీరం ఇన్ఫెక్షన్లు,వ్యాధులతో సమర్థవంతంగా పోరాడగలదు అని చెబుతున్నారు. నానబెట్టిన శనగలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయట. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందట. కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్ లో ఉండటం వల్ల గుండెపోటు, ఇతర గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. శనగపప్పు ఎలా తీసుకోవాలి అంటే.. రాత్రిపూట ఒక కప్పు శనగపప్పును శుభ్రమైన నీటిలో నానబెటట్టి ఉదయం లేచిన తర్వాత వాటిని బాగా కడిగి ఖాళీ కడుపుతో తినాలి. మీ రుచికి అనుగుణంగా కొద్దిగా ఉప్పు, అల్లం ముక్కలు లేదా కావాలనుకుంటే తేనెను కూడా కలుపుకోవచ్చని చెబుతున్నారు. ఇలా తరచుగా చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చట.