లివర్ సరిగ్గా పనిచేయాలంటే..లివర్ ఆరోగ్యాన్ని పెంచే బెస్ట్ డ్రింక్స్..టాక్సిన్లు క్లీన్

Liver Disease డీటాక్స్ అంటే మన బాడీలో పేరుకుపోయిన ట్యాక్సిన్స్‌ని బయటికి పంపే ప్రక్రియ. దీని వల్ల క్లెన్సింగ్ జరిగి ఆ అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. సాధారణంగా మన బాడీలోని వ్యర్థాలని లివర్ డీటాక్స్ చేస్తుంది. అలాంటి లివర్‌ని ఎప్పటికప్పుడు డీటాక్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే జీర్ణక్రియ తగ్గడం, చర్మ సమస్యలు, ఎనర్జీ తగ్గడం వంటి సమస్యలు ఉంటాయి. Top Foods, Fruits, and Home Remedies for Safe Detoxification డీటాక్స్ అనేది బాడీని బలంగా […]

Published By: HashtagU Telugu Desk
Top Foods, Fruits, and Home Remedies for Safe Detoxification

Top Foods, Fruits, and Home Remedies for Safe Detoxification

Liver Disease డీటాక్స్ అంటే మన బాడీలో పేరుకుపోయిన ట్యాక్సిన్స్‌ని బయటికి పంపే ప్రక్రియ. దీని వల్ల క్లెన్సింగ్ జరిగి ఆ అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. సాధారణంగా మన బాడీలోని వ్యర్థాలని లివర్ డీటాక్స్ చేస్తుంది. అలాంటి లివర్‌ని ఎప్పటికప్పుడు డీటాక్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే జీర్ణక్రియ తగ్గడం, చర్మ సమస్యలు, ఎనర్జీ తగ్గడం వంటి సమస్యలు ఉంటాయి.

Top Foods, Fruits, and Home Remedies for Safe Detoxification డీటాక్స్ అనేది బాడీని బలంగా మార్చడానికి కాకుండా వీటి పనితీరుని మెరుగ్గా మార్చేందుకు హెల్ప్ అవుతుంది. మనం రోజూ పొల్యూషన్‌లో తిరుగుతాం. సరిలేని ఫుడ్స్ తీసుకుంటాం. డ్రింక్స్ తాగుతాం. అందులోని టాక్సిన్స్ మన బాడీలో ముఖ్యంగా లివర్‌లో పేరుకుపోతుంటాయి. అలాంటప్పుడు వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం చాలా మంచిది. దీనికోసం మంచి హైడ్రేషన్ తీసుకోవడంతో పాటు మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి. అదే విధంగా, లివర్ చక్కగా డీటాక్స్ అవ్వడానికి హెల్ప్ చేసే సరైన డ్రింక్ గురించి ఆయుర్వేద డాక్టర్ వరలక్ష్మీ షేర్ చేసుకున్నారు. ఆ డ్రింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

లివర్ డీటాక్స్ ఎందుకు చేయాలి

మనకి లివర్ ప్రాబ్లమ్స్ జన్యుపరంగా లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్, వయసు, ఊబకాయం, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వంటి కారణాల వల్ల వస్తాయి. అలా జరిగినప్పుడు లివర్ దెబ్బతింటుంది. అయితే, దీనిని పట్టించుకోకుండా ట్రీట్ చేయకుండా వదిలితే ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి, లివర్‌ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇందులో లివర్ డీటాక్స్ చేయడం వల్ల లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ చాలా వరకూ తగ్గుతుంది.

కావాల్సిన పదార్థాలు

  • ​చిన్న అల్లం ముక్క​
  • పసుపు అంగుళం ముక్క
  • అంగుళం దాల్చిన చెక్క

ఏం చేయాలి?

ఓ గిన్నెలో నీరు పోసి అందులో ముందుగా అల్లం, పసుపు, దాల్చిన చెక్కల్ని వేయాలి. ఇప్పుడు నీటిని బాగా మరిగించాలి. వీటిని వడకట్టి వేడిగా తాగడం మంచిది. మీకు వీటి రుచి నచ్చకపోతే కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగండి. ఇలా తాగితే చాలా వరకూ మన టేస్టీగా ఉంటుంది. టీ, కాఫీలు తాగే బదులు, ఈ టీని తాగి చూడండి. ఎన్నో లాభాలు ఉంటాయి.

ఎలా పనిచేస్తుంది.

అల్లంలోని గుణాలు లివర్‌లో టాక్సిన్స్ పేరుకుపోకుండా హెల్ప్ చేస్తాయి. ఇక పసుపులోని గుణాలు నేచురల్‌గానే లివర్‌ని డీటాక్స్ చేస్తాయి. దాల్చిన చెక్కలోని గుణాలు లివర్ ఫంక్షన్‌ని మెరుగ్గా చేయడమే కాకుండా జీర్ణ సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. కడుపుని చక్కగా క్లీన్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండానే జీర్ణక్రియని మెరుగ్గా చేసి లివర్ పనితీరుని మెరుగు పరుస్తాయి. అంతేకాకుండా లివర్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేస్తాయి.

రోజూ ఉదయాన్నే తాగితే మంచిది

ఇలా తయారైన డ్రింక్‌ని రోజూ ఉదయాన్నే తీసుకుంటే లివర్‌లో టాక్సిన్స్ పేరుకుపోకుండా చేస్తాయి. అంతేకాకుండా, జీర్ణ సమస్యలు తగ్గిస్తాయి. దీంతో పాటు బరువుని తగ్గించడంలో కూడా ఈ డ్రింక్ హెల్ప్ చేస్తుంది. దీనిలోని గుణాలు చాలా వరకూ కడుపుని లైట్‌గా ఫీల్ అయ్యేలాగా చేస్తాయి. మంచి హెర్బల్ డ్రింక్ తీసుకోవాలనుకునేవారు ఈ డ్రింక్‌ని తీసుకోవచ్చు.

 

  Last Updated: 09 Jan 2026, 12:17 PM IST