Site icon HashtagU Telugu

Foot Soak: ఇలా చేస్తే నొప్పి, అలసట నిమిషాల్లో మాయం!

Foot Soak

Foot Soak

Foot Soak: రోజువారీ పనుల ఒత్తిడి తర్వాత సాయంత్రం వేళల్లో చాలామందికి కాళ్లలో (Foot Soak) భరించలేని నొప్పి, వాపు, అలసట వంటి సమస్యలు సాధారణంగా ఎదురవుతాయి. అప్పుడు మనసుకు వచ్చే ఆలోచన ఒక్కటే కాళ్లకు సంబంధించిన ఈ నొప్పి, వాపు, అలసట మొత్తాన్ని ఒక్క క్షణంలో లాగేసే ఏదైనా అద్భుతమైన పరిష్కారం దొరికితే ఎంత బాగుండు! అయితే దీనికి సంబంధించిన చికిత్స మీ ఇంట్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు.

పాదాల నొప్పి లేదా వాపుకు ఈ తెల్లటి క్రిస్టల్ ఒక వరంగా చెప్పవచ్చు. అవును మనం మాట్లాడుతున్నది ఫిట్‌కరీ గురించి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫిట్‌కరీలో యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

కేవలం 10 నిమిషాల్లో ప్రభావం

ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. మీరు గంటల తరబడి నిలబడి పనిచేయడం లేదా ఆఫీసులో పనిచేయడం వల్ల అలసిపోయి, కాళ్లలో తేలికపాటి నొప్పిని అనుభవిస్తున్నట్లయితే ఈ చిట్కా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Also Read: Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మ‌రో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!

చికిత్స విధానం

ముందుగా ఒక టబ్‌లో గోరువెచ్చని లేదా కొద్దిగా వేడి నీటిని తీసుకోండి. ఆ తర్వాత అందులో ఒక చిన్న టీస్పూన్ ఫిట్‌కరీ పొడిని లేదా ఫిట్‌కరీ చిన్న ముక్కను వేసి బాగా కరిగించండి. మీరు మీ పాదాలను ఈ నీటిలో కనీసం 10 నిమిషాల పాటు ఉంచాలి.

ఎంతసేపు, ఎంత లాభం?

మీరు 10 నిమిషాలు ఈ నీటిలో పాదాలను ఉంచితే దాని ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఫిట్‌కరీ వేడి నీరు మీ పాదాల కండరాల తిమ్మిరిని, అలసటను తక్షణమే తగ్గిస్తుంది. ఇందులో ఉండే గుణాలు పాదాల నరాలకు విశ్రాంతిని ఇస్తాయి. దీనితో పాటు నొప్పి క్రమంగా మాయమవుతుంది. ఒత్తిడిని దూరం చేయడానికి కూడా ఇది ఒక అద్భుతమైన మార్గంగా పరిగణించబడుతుంది.

ఫిట్‌కరీ నీటితో పాదాలకు కలిగే అదనపు ప్రయోజనాలు

Exit mobile version