Site icon HashtagU Telugu

Cucumber: వేసవిలో దోసకాయలు తినడం మంచిదే కానీ.. వీటితో కలిపి అస్సలు తినకూడదట!

Cucumber

Cucumber

వేసవి కాలంలో లభించే పండ్లలో దోసకాయలు కూడా ఒకటి. దోసకాయలు 90% నీరు ఉంటుంది. ఇది వేసవికాలంలో వచ్చే చాలా రకాల సమస్యలను తగ్గించడంలో ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే వేసవికాలంలో దొరికే ఈ దోసకాయలు తినడం మంచిదే కానీ కొన్నింటితో కలిపి అస్సలు తినకూడదని చెబుతున్నారు. మరి వేటితో కలిపి తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
​ముల్లంగిని పెరుగుతో కలిపి అసలే తినకూడదట..ఈ రెండింటి కలయిక ఆరోగ్యంపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందట. దోసలో ఆస్కార్బేట్ ఉంటుంది.

ఇది విటమిన్ సిని గ్రహించడంలో సహాయపడితే ముల్లంగి దీనిని అడ్డుకుంటుందట. కాబట్టి ఈ రెండింటి కలిపి తీసుకోకపోవడమే మంచిది అని చెబుతున్నారు. అలాగే డెయిరీ ప్రోడక్ట్స్‌తో దోసకాయని అస్సలు తీసుకోకూడదట.. ముఖ్యంగా పెరుగుతో. చాలా మంది పెరుగులో దోసకాయని వేసి రైతాలా చేస్తారు. దోసకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. మనం పెరుగులో వేసినప్పుడు పెరుగుని వేరు చేస్తుంది. పెరుగులో ఉండే క్రీమీ టెక్చర్ తగ్గుతుందట. పైగా దోసకాయలు వేయడం వల్ల పాల పదార్థాలు విరిగిపోయే అవకాశం ఉందట. దీంతో టేస్ట్ మారుతుందని, అయితే మీకు చల్లగా క్రీమీగా తీసుకోవాలనిపిస్తే పెరుగులో దోసకాయ కాకుండా బెర్రీస్, ఓట్స్ వంటివి కాంబినేషన్ చేసి తీసుకోవచ్చని చెబుతున్నారు.

చాలా మంది దోసకాయలు, టమాటతో సలాడ్ చేసుకుని తింటారు. ఇది టేస్టీగా కూడా ఉంటుంది. రెండింటి కలయిక చాలా టేస్టీగా ఉంటుందట. అయితే దోసకాయలు కొద్దిగా చేదు గుణం ఉంటుంది. ఇది పండిన టమాటల్లోని తీపిని పాడుచేస్తుందట. అందుకే వీటిని కలిపి తీసుకోకుండా టమాటల్ని మరో వెజిటేబుల్‌తో కలిపి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మీట్‌ తిన్నప్పుడు దోసకాయలు తినడం నిజానికీ అస్సలు మంచిది కాదట. దీని వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాగా మాంసంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆలస్యంగా జీర్ణమవుతుందట. ఇక దోసలోని ఎక్కువ నీటి శాతం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుందట..ఇవి రెండు మిస్‌ మ్యాచ్‌లు కాబట్టి జీర్ణ వ్యవస్థ డిస్టర్బ్ అవుతుందట. దీంతో బ్లోటింగ్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. దోసలోని అబ్జార్బిక్ యాసిడ్ విటమిన్ సి, ఇది జీర్ణ వ్యవస్థలో ప్రోటీన్స్‌ని అబ్జార్బ్ కాకుండా చేస్తుందట. అలాగే దోసకాయతో కలిపి సిట్రస్ ఫ్రూట్స్ అంటే నారింజ పండ్లు కలిపి అసలే తినకూడదట. దీని వల్ల దోస ఫ్లేవర్ డెలికేట్ చేస్తాయి. ఇందులోని అసిడిటీ గుణాలు తాజా దోస రుచిని మారుస్తాయని చెబుతున్నారు. ఈ రెండింటి కలయిక మరింత పుల్లగా మారుతుందట. దీంతో అసిడిటీ పెరుగుతుందట. క్రీస్పీ టెక్చర్ తగ్గుతుందట. దోసకాయ మెత్తగా మారుతుందట. అందుకే దోసకాయని పులుపుని కలపకుండా ఉండాలని చెబుతున్నారు.