Site icon HashtagU Telugu

Prawns: రొయ్యలు తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలు అస్సలు తినకండి.. అవేంటంటే?

Prawns

Prawns

రొయ్యలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నాన్ వెజ్ ఐటమ్స్ లో ఎక్కువ శాతం మంది ఇష్టపడే వాటిలో ఉన్న రొయ్యలు కూడా ఒకటి. ఈ రొయ్యలు ఎక్కువగా నదీ తీర ప్రాంతాల్లో సముద్ర ప్రాంతాల్లోనే లభిస్తూ ఉంటాయి. కొంతమంది రొయ్యలు ఇష్టంగా తింటే మరి కొంతమంది తినడానికి అంతగా ఇష్టపడరు. కాగా రొయ్యల్లో విటమిన్ బి12 కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బలహీనత, అలసటను తగ్గించడంలో సహాయపడుతుందట. ఇకపోతే రొయ్యలు తినడం మంచిదే కానీ రొయ్యలు తిన్న తర్వాత పొరపాటున కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలు అసలు తినకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఆహార పదార్థాలు ఏంటి అన్న విషయానికి వస్తే..

కేవలం రొయ్యలు మాత్రమే కాదు నాన్ వెజ్ ఐటమ్స్ ఏది తిన్నా కూడా ఆ తర్వాత వెంటనే పాలు తాగకూడదట. రొయ్యలను తరచుగా క్రీమీ సాస్‌ లతో కలిపి లేదా క్రీమ్ లేదా పాలలో వండుతారు. కానీ ఈ కలయిక అలెర్జీ ప్రతి చర్యలకు దారితీస్తుందట. ఎందుకంటే పాల ఉత్పత్తులలోని కాల్షియం రొయ్యలలోని ప్రోటీన్లతో చర్య జరిపి కడుపులో జీర్ణక్రియకు అడ్డుపడుతుందట. అయితే ఈ కాంబినేషన్‌ ఎక్కువకాలం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పొత్తి కడుపు నొప్పి, వికారం, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, అల్సర్లు, శరీరం చెడు వాసన, మలబద్ధకం, చర్మ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే రొయ్యలు తిన్న వెంటనే పెరుగు కూడా తినకూడదట. చాలామందికి నాన్ వెజ్ తిన్న తర్వాత చివర్లో ఒక ముద్ద అయినా పెరుగుతో తినందే తిన్నట్లు కూడా అనిపించదు. చేపతో భోజనం చేసిన తర్వాత పెరుగుతో తినకూడదట. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రొయ్యల బిర్యానీలో కూడా పెరుగు కలుపుకుని తింటాం. ఇది ఏ మాత్రం మంచిది కాదట. అజీర్తి సమస్యలు ఉన్నవారు ఈ కాంబినేషన్‌ కు దూరంగా ఉండాలని చెబుతున్నారు. కాగా ​వేయించిన ఆహారాలు, స్పైసీ ఫుడ్స్‌తో కలిపి రొయ్యలు తినకూడదట. రొయ్యలు తిన్నప్పుడు తేలికపాటి రుచి కొంత వరకు తగ్గుతుందట.

రొయ్యలతో పాటు వేయించిన ఆహారాలు, మసాలా ఫుడ్స్ తినడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, అసౌకర్యం, కడుపు నొప్పి వస్తాయట. అందుకే రొయ్యలతో పాటు ఈ ఫుడ్స్ తినకూడదని చెబుతున్నారు. బ్రెడ్, పాస్తా లేదా వైట్ రైస్ వంటి స్టార్చ్ అధికంగా ఉండే ఆహారాలు రొయ్యలతో కలిపి తినడం అంత మంచిది కాదట. రొయ్యలతో పాటు ఎక్కువ స్టార్చ్ తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యం కలుగుతుందట. జీర్ణ సమస్యలు, ఉబ్బరం, కడుపులో చికాకు వంటి సమస్యలు కలుగుతాయట. అందుకే ఈ ఫుడ్ కాంబినేషన్‌ ను అవాయిడ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. రొయ్యలతో పాటు సిట్రస్ ఫ్రూట్స్, జ్యూసులు తీసుకోకూడదట. సిట్రస్ ఫ్రూట్స్‌ లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. రొయ్యల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ కలిపి చర్య జరిపే అవకాశం ఉందట. దీంతో కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.