నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే వాటిలో చికెన్ కూడా ఒకటి. చికెన్ ను వారానికి రెండు మూడు సార్లు అయినా తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొందరు పకోడా రూపంలో లేదంటే చికెన్ కర్రీ రూపంలో తింటూనే ఉంటారు. చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిది కానీ అలా అని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. అదేవిధంగా చికెన్ తన్న తర్వాత కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రోటీన్ కోసం చికెన్, పాలు, గుడ్లు ఎక్కువగా తీసుకుంటున్నారు.
కొంతమంది వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు కాకుండా ప్రతిరోజూ చికెన్ తింటున్నారు. కానీ కొన్ని ఆహారాలతో కలిపి చికెన్ తినడం వల్ల సమస్యలు వస్తాయట. చికెన్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండూ కలిపితే జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇది శరీరంలో గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుందట. అదేవిధంగా చికెన్ తిన్న తర్వాత స్వీట్లు తినడం అసలు మంచిది కాదట. స్వీట్లు, పండ్ల రసాల్లో ఉండే అధిక చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిని దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఇది అలసటకు కారణమవుతుందట. చికెన్ బిర్యానీ తినేటప్పుడు చాలా మంది నిమ్మరసం జోడిస్తారు.
కానీ నిమ్మకాయ లేదా నారింజ వంటి ఆమ్ల పండ్లను చికెన్‌తో కలిపి తినడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయట. ఈ పండ్లలో ఉండే ఆమ్లాలు కడుపులోని జలాలతో కలిసితే ఆమ్లతను పెంచుతాయని కాబట్టి ఈ రెండు రకాల ఫుడ్స్ కలిపి తీసుకోకూడదని చెబుతున్నారు. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందట. చికెన్ తిన్న వెంటనే వడలు, చిప్స్ లేదా ఇతర వేయించిన పదార్థాలు తినడం మంచిది కాదట. ఇవి త్వరగా జీర్ణం కావట. అధిక కొవ్వు శరీరంలో ఉబ్బరం, బద్ధకం లాంటి సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. చాలా మంది మద్యం తాగేటప్పుడు చికెన్ తింటారు. కానీ చికెన్ తినడానికి ముందు లేదా తిన్న తర్వాత మద్యం తాగితే కాలేయంపై ఒత్తిడి పెరుగుతుందట. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉండకూడదు అంటే చికెన్ తిన్న తర్వాత పైన చెప్పిన ఆహార పదార్థాలను కలిపి అస్సలు తినకండి.
