Cholesterol: కూల్ డ్రింక్స్‌, వేయించిన ఫుడ్స్‌.. కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ను పెంచుతాయా..?

కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ముఖ్యమైనది సరైన ఆహారపు అలవాట్లు. కొలెస్ట్రాల్ రోగులకు విషపూరితమైనటువంటి 3 ఆహారాల గురించి ఈ రోజు మ‌నం తెలుసుకుందాం.

  • Written By:
  • Updated On - May 15, 2024 / 06:10 PM IST

Cholesterol: నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధిక కొలెస్ట్రాల్‌ (Cholesterol)తో ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు. ఇది గుండెపోటు, బిపి వంటి ఇతర వ్యాధులకు కార‌ణ‌మ‌వుతుంది. ఇటువంటి పరిస్థితిలో పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ముఖ్యమైనది సరైన ఆహారపు అలవాట్లు. కొలెస్ట్రాల్ రోగులకు విషపూరితమైనటువంటి 3 ఆహారాల గురించి ఈ రోజు మ‌నం తెలుసుకుందాం. వాటి వినియోగం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మీరు కూడా వీటిని తీసుకుంటున్న‌ట్ల‌యితే వెంటనే వాటికి దూరంగా ఉండండి.

వేయించిన, నూనె ఆహారాలు

వేయించిన ఆహారాలు కొలెస్ట్రాల్ స్థాయిలను వేగంగా పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందువల్ల కొలెస్ట్రాల్ బాధితులు పూరీ-కచోరీ, సమోసాల లాంటి వేయించిన వాటికి దూరంగా ఉండాలి. ఇవి ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు మీరు వీటిని తినాలని భావిస్తే పరిమితంగా మాత్రమే తినాలి. అలాంటి వాటిని ఎక్కువ‌గా తింటే ఆరోగ్యానికి హాని క‌లిగిస్తాయి.

Also Read: Business Idea: రోజుకు రూ. 5 వేల వ‌ర‌కు సంపాద‌న.. చేయాల్సిన ప‌ని కూడా సింపులే..!

ప్రాసెస్ చేసిన ఆహారాలకు నో చెప్పండి

ఇదే సమయంలో అధిక కొలెస్ట్రాల్ రోగులకు ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం కూడా హానికరం. కుకీలు, కేకులు, పేస్ట్రీలు వంటి బేకరీ ఆహారాలు అధిక కొవ్వు పదార్థాన్ని కలిగి ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి ఫుడ్‌కు కూడా దూరంగా ఉండాలి. చక్కెర అధికంగా ఉండే పానీయాలు, సోడా, మితిమీరిన స్వీట్లను కూడా తాగకుండా ఉండాలి. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి వేగంగా పెరుగుతుంది.

We’re now on WhatsApp : Click to Join

రెడ్ మీట్‌

ఇవే కాకుండా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు రెడ్ మీట్ తినకూడదు. ఎందుకంటే కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెడ్ మీట్‌లో చాలా సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు రెడ్ మీట్ మాత్రమే కాదు.. నాన్ వెజ్ ఫుడ్స్ కూడా చాలా తక్కువ మోతాదులో తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు స‌ల‌హా ఇస్తున్నారు.

Follow us