Site icon HashtagU Telugu

Health Tips: చికెన్ పెరుగు కలిపి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 15 Jul 2024 10 29 Am 174

Mixcollage 15 Jul 2024 10 29 Am 174

మామూలుగా చికెన్ మటన్ మాంసం తిన్నప్పుడు తప్పకుండా లాస్ట్ లో పెరుగు అన్నం లేదంటే మజ్జిగ తాగుతూ ఉంటారు. కొందరు అయితే చికెన్,మటన్ వంటి వాటిలోకి పెరుగు పచ్చడి కూడా వేసుకొని తింటూ ఉంటారు. కొంతమందికి మాంసం తిన్న ప్రతిసారి కూడా తప్పనిసరిగా పెరుగు తినాల్సిందే అని చెబుతూ ఉంటారు. కానీ పెరుగు, చికెన్ కలిపి తినడం అంత మంచిది కాదు అంటున్నారు వైద్యులు. మరి పెరుగు చికెన్ కలిపి తింటే ఏం జరుగుతుంది? దీని వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చికెన్ ను తింటునప్పుడు కొన్ని రకాల ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. ఇవి మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అవి శరీరంలో అలెర్జీలు , ప్రతి చర్యలకు కారణం అవుతుంది. అంతేకాకుండా ఇది తీవ్రమైన వ్యాధులకు కూడా దారితీస్తుంది. చికెన్ తో పాటు పాలు తాగడం విషంతో సమానమట. ఎందుకంటే ఈ రెండూ కలిసి శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయట. దీనివల్ల దద్దుర్లు, తెల్లని మచ్చలు, దురద వంటి సమస్యలు వస్తాయట. అందుకే చికెన్ ను తిన్న వెంటనే పాలను తాగకూడదు అంటున్నారు వైద్యులు. అలాగే చికెన్ చేపలను కలిపి తినేవారు కూడా ఉన్నారు.

కానీ ఇలా చికెన్ ను తింటూ చేపలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ రెండింటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కానీ ఇవి వివిధ రకాల ప్రోటీన్లు. ఈ రెండూ కలిస్తే అది శరీరానికి హానికరం. కొంతమంది చికెన్ తో పాటుగా పెరుగు తినడాన్ని బాగా ఇష్టపడతారు. కానీ పెరుగు చల్లగా, చికెన్ వేడిగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని తింటే ఇది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు వైద్యులు.