Foods: ఈ ఆహార పదార్థలతో అస్సలు కలిపి తినకూడదు.. తింటే అలాంటి ప్రమాదాలు తప్పవు?

సాధారణంగా ఎటువంటి ఆహార పదార్థాలు అయినా కూడా మితంగా తీసుకోవాలి అని అంటూ ఉంటారు. అయితే మనం

  • Written By:
  • Publish Date - July 28, 2022 / 07:03 AM IST

సాధారణంగా ఎటువంటి ఆహార పదార్థాలు అయినా కూడా మితంగా తీసుకోవాలి అని అంటూ ఉంటారు. అయితే మనం తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాల మధ్య పొందిక ఉండదు. అటువంటి పొందిక లేని ఆహార పదార్థాలు వెనువెంటనే చేసుకోవడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా విరుద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను తినకుండా ఉండాలి అని చెబుతూ ఉంటారు. అటువంటి ఆహారాలు కలిపి తీసుకోవడం వల్ల శరీరం పోషకాలను గ్రహించుకోలేదు. తద్వారా జీర్ణసంబంధ సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి.

మరి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ, పాలకూర ఇలాంటి వాటిని క్రూసిఫెరస్ కూరగాయలుగా చెప్పుకునే వీటిలో అయోడిన్ ను మన శరీరం గ్రహించకుండా చేసే కెమికల్ కాంపౌండ్ వీటిల్లో ఉంటుంది. దీంతో థైరాయిడ్ గ్రంధి పనితీరు పై ప్రభావం పడుతుంది. కనుక థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు వీటి వినియోగాన్ని తగ్గించుకోవాలి. వీటిని చేపలు, డైరీ ఉత్పత్తులు, శుద్ధి చేసిన సాల్ట్ తో కలిపి తీసుకోకూడదు. విటమిన్ సీ తగినంత లభించే సిట్రస్ పండ్లు అయిన నిమ్మ , కమలా, బత్తాయి, ప్లమ్, బెర్రీలలో కేసియన్ అనే యాసిడ్ అనే ఉండటం వల్ల వాటిని పాలు, పాల పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. అలా అవి రెండు కలిపి తీసుకోవడం వల్ల పాలు జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. పాలు గడ్డకట్టడం వల్ల గ్యాస్, గుండె మంట తదితర సమస్యలు కనిపిస్తాయి. పండ్లు చాలా తేలికగా జీర్ణం అవుతూ ఉంటాయి.

భోజనం పూర్తిగా అరిగించుకునేందుకు సమయం ఎక్కువ పడుతుంది. అలాంటప్పుడు జీర్ణమయ్యే సమయంలో ఇటువంటి పోలికలు లేని పండ్లు, ఆహారాన్ని ఒకేసారి తీసుకోకూడదు దీనివల్ల ఆహారం జీర్ణమయ్యి, పండ్లు అజీర్ణంగా ఉంటాయి. దానివల్ల ఫెర్మేంటేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇది గ్యాస్ లాంటి సమస్యను కలిగిస్తుంది. ఆకుపచ్చని కూరగాయలు,నట్స్, ముడి ధాన్యాలలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. విటిని టీతో కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే టీలోని ట్యాన్నిస్, ఆక్సలేట్స్ ఐరన్ ను మన శరీరం తీసుకోకుండా అడ్డుకుంటాయి.