మటన్ రేట్ ఎంత ఉన్న కొందరికి వారానికి కనీసం రెండుసార్లు అయినా మటన్ ఉండాల్సిందే. ముక్కలేనిదే చాలామందికి ముద్ద కూడా దిగదు. ఇక ఆదివారం వచ్చింది అంటే చాలు రాగి సంగటి ఉండాల్సిందే.. మటన్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మటన్ లో వివిధ రకాల సహజమైన, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఒలేయిక్ యాసిడ్, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్, ఇది ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు చేసే కాల్షియం కూడా మటన్ లో పుష్కలంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే రెడ్ మీట్ ఎక్కువగా తినకూడదట. అంతేకాకుండా మటన్ తిన్న తర్వాత లేదా మటన్ తో పాటు కొన్ని తినకూడని ఫుడ్స్ ఉన్నాయి. ఇవి తింటే ఆరోగ్యానికి డేంజర్ లో పడ్డట్టే అని చెబుతున్నారు.
మరి మటన్ తిన్న తర్వాత ఎలాంటి పదార్థాలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మటన్ మంచిదే కదా అని ఎక్కువగా తింటే అది ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపిస్తుందట. మటన్ ప్రతిరోజు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మటన్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి సాధ్యమైనంత త్వరగా బర్న్ అవ్వాలి. లేదంటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే మటన్ ఎక్కువ తింటే బరువు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మటన్ ఎక్కువ తింటే మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందట. అంతేకాకుండా శరీరానికి వేడి చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే మటన్ ఎక్కువగా తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయట. కాబట్టి మటన్ మంచిదే కదా అని ఎక్కువగా తినడం మంచిది కాదని చెబుతున్నారు.
కాగా మటన్ తిన్న వెంటనే బంగాళదుంప తినకూడదట. ఎందుకంటే చికెన్, మటన్‌లో ప్రోటీన్లు ఎక్కువ. అయితే, బంగాళదుంపలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు కలిపి తింటే అజీర్తి సమస్యలు, వికారం, వాంతులు వచ్చే ప్రమాదముంది. అందుకే వీటిని కలిపి తీసుకోకూడదట.
మనలో చాలా మంది మటన్ తిన్నతర్వాత పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అయితే ఈ కాంబినేషన్ ఏ మాత్రం మంచి కాదని చెబుతున్నారు. పండ్ల రసాలు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు ఎక్కువ అవుతాయని అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా జీర్ణక్రియ మందగిస్తుందట. అంతేకాకుండా టాక్సిన్స్ కూడా విడుదల అవుతాయని, అందుకే మటన్ తిన్న తర్వాత పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ జోలికి పోకూడదని ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. చికెన్, మటన్ ఎక్కువగా తింటే వేడి చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఇవి ఎక్కువగా తింటే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ లెవల్స్ పెరుగుతాయట. ఇక తేనె కూడా జీర్ణమవ్వడానికి సమయం పడుతుందట. అందుకే మటన్ తిన్న వెంటనే తేనె తీసుకోకూడదని, ఈ రెండింటి కాంబినేషన్ చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు.