Site icon HashtagU Telugu

Mango: మామిడి పండ్లు తిన్న తర్వాత ఇలాంటి ఫుడ్స్ తింటున్నారా.. అయితే జాగ్రత్త మీకు సమస్యలు రావడం ఖాయం!

Mango

Mango

వేసవి కాలం వచ్చింది అంటే చాలా మామిడి పండ్లు మనకు విరివిగా లభిస్తూ ఉంటాయి. అయితే మామిడిపండ్లు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటూ ఉంటారు. మామిడి పండ్ల వల్ల అనేక రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మామిడిపండును తినడం మంచిదే కానీ మామిడిపండు తిన్న తరువాత పొరపాటున కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదని చెబుతున్నారు. మరి మామిడి పండు తిన్న తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామిడి పండు తిన్న తర్వాత వెంటనే పెరుగు మజ్జిగ వంటివి అసలు తీసుకోకూడదట.

మామిడి పండుతో కూడా కలిపి తినకూడదని చెబుతున్నారు. ఇలా చేస్తే కడుపులో కార్బన్డయాక్సైడ్ పరిమాణం చాలా వరకు పెరుగుతుందని ఇది కడుపు నొప్పి వంటి సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు. ఈ రెండు రకాల ఫుడ్ కాంబినేషన్ ఎక్కువ కాలం పాటు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ముఖ్యంగా పొత్తికడుపు నొప్పి వికారం అజీర్ణం గ్యాస్ కడుపు ఉబ్బరం, మలబద్ధకం చర్మ సంబంధించిన సమస్యలు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. మామిడిపండు, సిట్రస్ ఫ్రూట్స్ కాంబినేషన్‌ కూడా ఆరోగ్యానికి మంచిది కాదట. పొరపాటున కూడా మామిడి పండుతో నిమ్మ, నారింజ, గ్రేప్ ఫ్రూట్ వంటి సిట్రస్ పండ్లను తినకూడదని చెబుతున్నారు.

ఈ కాంబినేషన్ శరీరంలోని pH సమతుల్యతను దెబ్బతీస్తుందట. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందట. ముఖ్యంగా మామిడి, సిట్రస్ ఫ్రూట్స్ కలిపి తినడం వల్ల జీర్ణక్రియకు అటంకం కలుగుతుందట. దీంతో కడుపులో నొప్పి, మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. అందుకే ఈ ఫుడ్ కాంబినేషన్ అవాయిడ్ చేయడం చెబుతున్నారు. ​మామిడి పండు తిన్న వెంటనే కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలట. మామిడి తిన్న వెంటనే స్పైసీ ఫుడ్స్ ఫుడ్స్ తినడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయట. అందుకే మామిడి పండుతో పాటు స్పైసీ, మసాలా ఫుడ్స్ తినకూడదని చెబుతున్నారు. మామిడి తిన్న తర్వాత వెంటనే అలాంటి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిదని చెబుతున్నారు. మామిడిపండు తిన్న వెంటనే చాలా మంది కూల్‌ డ్రింక్స్ తాగుతుంటారు. ఈ ఫుడ్ కాంబినేషన్ చాలా డేంజర్ అని చెబుతున్నారు. మామిడికాయ తిన్న తర్వాత అస్సలు కూల్ డ్రింక్స్ తాగకూడదట. ఇది మీ జీర్ణక్రియను చెడగొట్టవచ్చట. జలుబు, దగ్గు వంటి సమస్యలతో పాటు కడుపు ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు.