చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ చేపలలో ముళ్ళు ఉంటాయని చాలామంది వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ చేపల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు ఉండలేరు. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి2, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, అయోడిన్, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. అయితే చేపలు తిన్న వెంటనే లేదా కొన్ని తినకూడని ఫుడ్స్ ఉన్నాయి. ఇవి తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. మరి చేపలు తిన్న తర్వాత ఎలాంటి పదార్థాలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చికెన్, మటన్ లేదా చేపలు ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ తిన్న తర్వాత పాలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
కేవలం పాలు మాత్రమే కాకుండా పాల పదార్థాలు కూడా తీసుకోకూడదని చెబుతున్నారు. పాలు జీర్ణమయ్యే ప్రక్రియ చేపలకు భిన్నంగా ఉంటుంది. పాలు, చేప కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి. చేప జీర్ణం కావడానికి సమయం పడుతుంది, ఇది జీర్ణ ప్రక్రియకు అడ్డుపడుతుంది. ఈ కాంబినేషన్ ఎక్కువకాలం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పొత్తికడుపు నొప్పి, వికారం, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, అల్సర్లు, శరీరం చెడు వాసన, మలబద్ధకం, చర్మ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పెరుగు కూడా చేపతో కలిపి తీసుకోకూడదు. చాలా మంది చేపతో భోజనం చేసిన తర్వాత.పెరుగుతో తినకూడదు.
ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. చాలామంది చేప బిర్యాని తిన్నప్పుడు పెరుగు కూడా తింటూ ఉంటారు. కానీ ఇలా అస్సలు తినకండి. వేయించిన ఆహార పదార్థాలు చేపలతో పాటు కలిపి తినకూడదట. స్పైసీ ఫుడ్స్‌తో కలిపి చేపలు తినకూడదు. చేపలను తిన్నప్పుడు తేలికపాటి రుచి కొంత వరకు తగ్గుతుంది. చేపలతో పాటు వేయించిన ఆహారాలు, మసాలా ఫుడ్స్ తినడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, అసౌకర్యం, కడుపు నొప్పి వస్తాయి. అందుకే చేపతో పాటు ఈ ఫుడ్స్ తినకూడదని చెబుతున్నారు. అలాగే చేపలు తిన్న వెంటనే బంగాళదుంప తినకూడదట. చేపల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. బంగాళదుంపలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు కలిపి తింటే అజీర్తి సమస్యలు, వికారం, వాంతులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వీటిని కలిపి తీసుకోకూడదని చెబుతున్నారు. చేపలు తిన్న తర్వాత సిట్రస్ పండ్లు తీసుకోకూడదట. సిట్రస్ ఫ్రూట్స్ లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. చేపల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ కలిపి చర్య జరిపే అవకాశం ఉంది. దీంతో కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదంఉంది అని చెబుతున్నారు.