Exercise: వ్యాయామం తర్వాత పొరపాటున కూడా అలాంటి ఫుడ్స్ ని అస్సలు తినకండి.. తిన్నారో!

కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తున్నారు. అందులో భాగంగానే తరచుగా వ్యాయామాలు, ఎక్సర్సై

  • Written By:
  • Publish Date - January 26, 2024 / 08:40 PM IST

కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తున్నారు. అందులో భాగంగానే తరచుగా వ్యాయామాలు, ఎక్సర్సైజులు, జిమ్ములకు వెళ్లడం సరైన డైట్ ను ఫాలో అవ్వడం మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు చాలామంది ప్రస్తుతం ఉదయాన్నే వ్యాయామం చేస్తూ ఉంటారు. ఉదయం సమయంలో కుదరని వారు కొంతమంది సాయంత్రం సమయంలో కూడా వ్యాయామం చేస్తూ ఉంటారు. అయితే వ్యాయామం చేయడం మంచిదే కానీ పొరపాటున కూడా వ్యాయామం చేసిన తర్వాత కొన్ని రకాల ఫుడ్స్ ని అసలు తీసుకోకూడదు. మరి వ్యాయామం తర్వాత ఎలాంటి ఫుడ్స్ ని తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వ్యాయామం చేసేవారు ఎప్పటికప్పుడు ఆ సీజన్లలో లభించే తాజా పండ్లు మాత్రమే తినాలి. వాటిలో వాటర్ కంటెంట్‌తో పాటు ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తుంది. అరటి, జామ, బత్తాయి వంటివి వర్కౌట్స్ తరువాత తింటే శరీరానికి శక్తి లభిస్తుంది. జీర్ణక్రియ కూడా బలోపేతం అవుతుంది. పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర పోషకాలు బరువు తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గ్రీక్ యోగర్ట్‌ అనేది ఒక రకమైన పెరుగు. ఇందులో ప్రొటీన్స్ అధికంగా, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. దీనికి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్, నేచురల్ షుగర్ అందాలంటే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్‌బెర్రీస్ వంటి తాజా బెర్రీలను ఆహారంలో చేర్చుకోవవాలి. వీటి కలయికతో గ్రీక్ యోగర్ట్ పోషకాలు బ్యాలెన్స్ అవుతాయి. బరువు తగ్గే ప్రయత్నంలో వర్కౌట్స్ చేసిన తరువాత గ్రీక్ యోగర్ట్ తీసుకుంటే శరీరానికి పోషకాలు సమృద్ధిగా అందుతాయి.

గుడ్లు, టోస్ట్‌లో ప్రొటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. విటమిన్స్, ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు తీవ్రమైన వర్కౌట్స్ తరువాత వీటిని తింటే ప్రయోజనం ఉంటుంది. ఇవి కండరాలను బలోపేతం చేస్తాయి. ఎక్కువసేపు పొట్టకు సంతృప్తి భావనను అందిస్తాయి. అతి ఆకలి వేయదు. జంక్ ఫుడ్స్ తినాలనే కోరిక తగ్గిపోతుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. చిక్‌పీస్‌లో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని వర్కౌట్స్ తరువాత తింటే బరువు తగ్గడానికి వీలు ఉంటుంది. ఎందుకంటే ఇవి సంతృప్తి భావనను మెరుగుపర్చుతాయి. కరకరలాడే, రుచికరమైన స్నాక్స్ కోసం చిక్‌పీస్‌కు ఆలివ్ నూనె, మిరపకాయ, జీలకర్ర, వెల్లుల్లి పొడి వంటి మసాలా దినుసులను జతచేసి ఓవెన్‌లో రోస్ట్ చేయాలి. తినకూడని పదార్థాల విషయానికొస్తే.. ఎనర్జీ బార్స్ తినడానికి రుచికరంగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి అంత మంచివికావు. వీటిలో షుగర్ కంటెంట్‌తో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ప్రిజర్వేటివ్స్ జోడించి ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినకపోవడం మంచిది. మాములుగా వ్యాయామం తరువాత సాల్ట్ ఉత్పత్తులను కొందరు తింటారు. వర్కౌట్స్ కారణంగా తరచుగా చెమట రూపంలో నీరు, పొటాషియం కోల్పోతారు.

అయితే సాల్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో కేలరీలు అధికంగా ఉంటాయి. అందుకే వాటికి బదులు పోషకాలు, ఖనిజాలు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఫలితంగా బరువును నియంత్రించవచ్చు. ఈ రకం ఫుడ్స్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇవి ఆరోగ్యానికి అసలు మంచివి కావు. కేలరీలు, మసాలా కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిని తరచుగా తింటే జీర్ణసమస్యలతో పాటు బరువు పెరుగుతారు. అందుకే ఫ్రైడ్ ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోకూడదు కార్బోనేటేడ్ డ్రింక్స్, ఎనర్జీ స్పోర్ట్స్ డ్రింక్స్ తాగడం మానుకోవాలి. ఎందుకంటే వీటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే ప్రయత్నాలకు ఇవి గండికొడతాయి. ఎందుకంటే వీటిలో ఉండే కేలరీలు బరువు పెరగడానికి దారితీస్తాయి. అందుకే షుగర్ ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచిది.