Blood Pressure: అరటిపండు తింటే బీపీ తగ్గుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

ప్రస్తుత రోజుల్లో అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే అధిక రక్తపోటు

Published By: HashtagU Telugu Desk
Blood Pressure

Blood Pressure

ప్రస్తుత రోజుల్లో అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే అధిక రక్తపోటు సమస్య వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇది ప్రాణాంతక రోగాలకు కూడా దారితీస్తుంది. మరి ముఖ్యంగా గుండె పోటుకు దారి తీయడంలో అధిక రక్తపోటు సమస్య ప్రధాన పాత్రను పోషిస్తుంది. కాబట్టి అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే రక్త పోటును నియంత్రణలో ఉంచుకోవడానికి మెడిసిన్స్ తో పాటు అనేక రకాల ఆరోగ్య చిట్కాలు కూడా ఉన్నాయి. వీటిలో మరియు ముఖ్యంగా మనం తినే ఆహారం కూడా ఒక చక్కటి ఔషధంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు.

కొన్ని రకాల ఆహారాలు బీపీ పెరగడానికి కారణమవుతాయి. ఈ రకమైన ఆహారాలను తినడం వెంటనే మానుకోవాలి. అదేవిధంగా కొన్ని ఆహారాలు బీపీని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. మరి ఆహారాన్ని నియంత్రించడానికి సహాయపడే ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆకుకూరలలో బచ్చలికూర వంటి ఆకుకూరలు రక్తపోటును నియంత్రించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఈ ఆకుకూరలలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఉండే పొటాషియం మూత్రపిండాలు శరీరానికి చేరిన అదనపు సోడియంను బయటకు పంపడానికి సహాయపడుతుంది.

ఆ విధంగా బీపీని నియంత్రించవచ్చు. అలాగే అరటిపండ్లలో కూడా పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. అరటిపండు రక్తపోటును నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. కాబట్టి రక్తపోటు సమస్యతో బాధపడే వారు ప్రతి రోజు ప్రతిరోజూ ఒక అరటిపండు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దాంతో పాటు అరటి పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో రకాల మేలును కలిగిస్తాయి.

  Last Updated: 15 Nov 2022, 08:14 PM IST