Site icon HashtagU Telugu

Platelet: రక్తకణాల సంఖ్య తగ్గిపోయిందా.. అయితే వీటిని తినాల్సిందే!

Platelet

Platelet

రక్తకణాలు వీటినే ప్లేట్ లెట్స్ అని పిలుస్తుంటారు. ఇవి మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం అన్న విషయం మనందరికి తెలిసిందే. ఇవి చిన్న,పెద్ద గాయాలను నయం చేయడానికి అలాగే రక్తం గడ్డం కట్టడానికి ఉపయోగపడతాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ఈ రక్తకణాల సంఖ్య ఎక్కువగా ఉన్న పర్లేదు కానీ తక్కువగా ఉంటే మాత్రం లేని పోని సమస్యలు వస్తూ ఉంటాయి. ప్లేట్లెట్ కౌంట్ తగ్గితే అది మీ ఆరోగ్యంపై చాలా హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే రక్తకణాల సంఖ్య తగ్గినప్పుడు కొన్ని రకాల ఆహారాలు ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడతాయని చెబుతున్నారు.

మరి అందుకోసం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. దానిమ్మ పండ్లు పోషకాలకు మంచి వనరులు అని చెప్పవచ్చు. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజకరంగా ఉంటాయి. వీటిని తింటే శరీరంలో రక్తం పెరగడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే దానిమ్మ పండ్లను తినడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ బాగా పెరుగుతుందని చెబుతున్నారు. బొప్పాయి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తింటే కూడా
ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుందని చెబుతున్నారు.

అలాగే బొప్పాయి ఆకురసం తాగినా ప్లేట్ లెట్ కౌంట్ బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా బచ్చలికూరలో కూడా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇది మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ కె, ఐరన్ ఎక్కువగా ఉండే బచ్చలికూరను తినడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే బీట్ రూట్ ను తింటే ఒంట్లో రక్తం పెరుగుతుందట. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందట. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుందని చెబుతున్నారు. గుమ్మడికాయను తినేవారు చాలా తక్కువే. కానీ ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉండే గుమ్మడికాయలను తీసుకోవడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ బాగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.