వర్షాకాలంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతూ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు రోగనిరోధక శక్తి సరిగా లేక వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు అటాక్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా జ్వరం దగ్గు జలుబు వంటి ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరగాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. మరి అందుకోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
యాపిల్స్ లో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో బాగా సహాయపడతాయి. అంతేకాకుండా ఈ పండ్లను తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం కూడా రాదని చెబుతున్నారు. బొప్పాయి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అయితే వర్షాకాలంలో ఈ బొప్పాయి పండును తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుందట. పసుపులో కూడా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో వచ్చే ఇన్ఫెక్షన్లతో పోరడడానికి సహాయపడతాయి. వెల్లుల్లి కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబును తొందరగా తగ్గించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే దానిమ్మ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే వర్షాకాలంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంతేకాదు ఇది మీ లైంగిక జీవితాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.