షుగర్ వ్యాధిగ్రస్తులకు అతిపెద్ద టాస్క్ రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడం. ఇందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే రకరకాల మెడిసిన్స్ ఇంజక్షన్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది ఆయుర్వేద చిట్కాలు వాడుతూ ఉంటారు. వాటితో పాటు కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఎలాంటి ఆహార పదార్థాలు డైట్లో చేర్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డయాబెటిస్ పేషెంట్లు ఏది పడితే అది తినకూడదట. పగలు కంట్రోల్ లో ఉంది అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవని చెబుతున్నారు. ఇంతకీ డయాబెటిస్ పేషెంట్లు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అన్న విషయానికి వస్తే..
డయాబెటిక్ పేషెంట్లకు జొన్నలు ఒక అద్భుతమైన మిల్లెట్ అని చెప్పాలి. జొన్న పిండితో చేసిన రొట్టెలను తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందట. జొన్నల్లో విటమిన్స్, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియని సులువు చేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయట. అందుకే డయాబెటిక్ పేషెంట్లు చపాతీలకు బదులు జొన్న రొట్టెలు తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇందులో విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పసుపులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలోని షుగర్ లెవల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది.
చలి కాలంలో పసుపును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయట. పసుపును కూరల్లో, పానీయాల్లో, పచ్చళ్ల రూపంలో తీసుకోవచ్చని చెబుతున్నారు. అలాగే రాగులు కూడా ఒక ఆరోగ్యకరమైన మిల్లెట్ అని చెప్పాలి. రాగులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. రాగులు తరచుగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయట. అలాగే షుగర్ లెవెల్స్ పెరగకుండా నిరోధిస్తాయి. కాబట్టి రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇటీవల కాల్షియం లోపం కూడా తీరుతుందట. శరీరానికి కావలసిన బలాన్ని కూడా అందిస్తుందని చెబుతున్నారు. షుగర్ అదుపులో ఉండటం కోసం ఉసిరి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఉసిరిలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. ఉసిరి రోజు మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందట. అలానే ఉసిరిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, యాంటీ గ్లైసమిక్ గుణాలు కూడా ఉన్నాయి. దీనిలో ఫైబర్, మినరల్స్, ప్రోటీన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయట. ఈ పోషకాలు మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయని,ఉసిరి జ్యూస్ రోజూ తాగడం వల్ల షుగర్‌ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. అలాగే కాకరకాయ జ్యూస్ లేదా వేపరసం కూడా డైట్ లో చేర్చుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుందట.