Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలు అసలు తినకండి!

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు పొరపాటున కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తినకూడదని వైద్యులు చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Kidney Stones

Kidney Stones

ప్రస్తుత రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడే వారు చేసే ముఖ్యమైన తప్పు తినకూడని ఆహార పదార్థాలు తినడం. మరి కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ సమస్యతో బాధపడుతున్న వారు సోడియం ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకోకూడదట. సోడియం పుడ్స్ కూడా కిడ్నీల్లో రాళ్ళని ఏర్పరుస్తాయట.

ఇందులో ఎక్కువగా మీట్, క్యాన్డ్ సూప్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి. హై సోడియం లెవల్స్ మూత్రంలో కాల్షియం ని పెంచుతాయి. దీని కారణంగా రాళ్ళు ఏర్పడతాయట. కాబట్టి వీటిని తక్కువగా తినడమే మంచిదని చెబుతున్నారు. బయట దొరికే స్నాక్స్‌ లో కూడా సోడియం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి వీటిని కూడా తీసుకోవద్దని చెబుతున్నారు.. ఇకపోతే ఫాస్పరస్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోకూడదట. మిల్క్ ప్రోడక్ట్స్, గుడ్లు, సీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నాయి. ఫాస్పేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌లోని కాల్షియం ఫాస్పరస్ రాళ్ళని ఏర్పరుస్తుంది. ఇవి ఆరోగ్యమైనప్పటికీ ఎక్కువగా తీసుకోవద్దు. అలాగే వీటిలో సోడా, స్వీట్ డ్రింక్స్‌ ఉన్నాయి. ఎక్కువగా షుగర్ తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్ళ సమస్య వచ్చే ప్రమాదం ఉంది.

దీంతో పాటు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ, సోడాలు, కూల్‌డ్రింక్స్ కూడా తీసుకోవడం తగ్గించాలని చెబుతున్నారు. కాగా కెఫిన్ ఒక మూత్ర విసర్జన‌లా పనిచేస్తుంది. దీనిని ఎక్కువగా తీసుకుంటే డీ హైడ్రేషన్‌కి కారణమవుతుందని చెబుతున్నారు. అలాగే రెడ్‌మీట్, పౌల్ట్రీ, గుడ్ల వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయట. దీని వల్ల యూరిక్ యాసిడ్ రాళ్ళు ఏర్పడతాయి. కాబ్టటి వీటిని తగ్గించాలని చెబుతున్నారు. ఇప్పుడు చెప్పే ఫుడ్స్‌ని పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. తినడం కొంచం వరకు తగ్గిస్తే సరిపోతుందట. సోడియం పుడ్స్ కూడా కిడ్నీల్లో రాళ్ళని ఏర్పరుస్తాయి. ఇందులో ఎక్కువగా మీట్, క్యాన్డ్ సూప్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి. హై సోడియం లెవల్స్ మూత్రంలో కాల్షియంని పెంచుతాయి. దీని కారణంగా రాళ్ళు ఏర్పడతాయట. కాబట్టి, వీటిని తక్కువగా తినడమే మంచిదని చెబుతున్నారు

  Last Updated: 27 Dec 2024, 04:36 PM IST