Periods Delay: పీరియడ్స్ ని ఆలస్యం చేయగల ఆహారాలు ఇవే..?

మహిళలకు ప్రతినెలా పీరియడ్స్ రావడం అన్నది కామన్. అయితే కొంతమందికి కొన్ని కొన్ని సార్లు తరచుగా రావడానికి

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 01:30 PM IST

మహిళలకు ప్రతినెలా పీరియడ్స్ రావడం అన్నది కామన్. అయితే కొంతమందికి కొన్ని కొన్ని సార్లు తరచుగా రావడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది అయితే వాటిని ఆలస్యం చేయాలి అని కోరుకుంటూ ఉంటారు. అటువంటి వారి కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. వాటిని తినడం వల్ల సహజ సిద్ధంగానే పీరియడ్స్ ఆలస్యం అయ్యే విధంగా చేస్తాయి. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అందుకోసం 10 గ్రాముల చింతపండు గుజ్జును గ్లాస్ నీటిలో కలిపి తాగాలి. పులుపు తాగలేము అనుకున్న వారు షుగర్ లేదా ఉప్పు కలుపుకొని తాగవచ్చు.

ఇది పీరియడ్స్ ని ఆలస్యం చేస్తుంది. అలాగే నిమ్మరం తాగడం వల్ల కూడా పీరియడ్ ఆలస్యంగా వస్తుంది. రాజకౌంటి నిమ్మకాయను మాత్రమే తాగాలి రోజుకు ఒక టీ స్పూన్ కి మించి నిమ్మరసం తీసుకోకూడదు. అలాగే లెమన్ టీ కూడా తాగవచ్చు. పీరియడ్స్ ఆలస్యం చేయడానికి దాల్చిన చెక్క కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే రక్తస్రావం నొప్పి మంటలను నివారిస్తుంది. కప్పు నీటిలో అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి ని వేడి నీటిలో వేసి అందులో తేనె లేదా షుగర్ కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. కీరదోస తినడం వల్ల కూడా పీరియడ్స్ ను ఆలస్యం చేయవచ్చు. తీయనైన పుచ్చకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి పీరియడ్స్ కూడా వాయిదా పడే విధంగా చేయగలవు.

పీరియడ్స్ అవ్వడానికి ఒక వారం ముందు ఒక గిన్నెడు పుచ్చకాయ ముక్కల్ని తినడం వల్ల ఫలితం కనిపిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా పీరియడ్స్ ని ఆలస్యం చేయడంలో అత్యంత ప్రభావంతంగా పనిచేస్తుంది. అలాగే కందిపప్పు, పచ్చిపప్పు, పెసరపప్పు వంటి వాటిని చిన్న మంటపై వేయించి మిక్సీలో పొడి చేసి గాలి చొరబడని సీసాలో ఉంచి ఈ రోజు కప్పునిధిలో చెంచాడు పొడిని కొద్దిగా ఉప్పు లేదా నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే పీరియడ్స్ కి పది రోజుల ముందు ఇలా చేయవచ్చు. ఒకవేళ కడుపు ఉబ్బరంగా ఉంటే వెంటనే మానేయండి.