Site icon HashtagU Telugu

Bone Health Foods : పాలు తాగాలంటే చిరాకా? ఈ ఫుడ్స్ కూడా ఎముకలకు బలమే..

Calcium Food

Calcium Food

Bone Health Foods : మన శరీరంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే.. క్యాల్షియం ఎంతో అవసరం. శరీరానికి సమపాళ్లలో క్యాల్షియం అందకపోతే ఎముకలు గుల్లగా తయారవుతాయి. అలాగే కీళ్లనొప్పులు వంటి సమస్యలు కూడా వస్తాయి. రోజూ తీసుకునే ఆహారంలో తగినంత క్యాల్షియం ఉండేలా చూసుకోవాలి. శరీరానికి రోజుకు 700 మిల్లీ గ్రాముల క్యాల్షియం కావలసి ఉంటుంది. అయితే అది పాలు తాగినంతనే అందదు. క్యాల్షియం ఉండే ఇతరత్రా ఆహారాలను కూడా తీసుకోవాలి. చియా సీడ్స్, సోయాబీన్స్, రాజ్మా గింజలలోనూ క్యాల్షియం ఉంటుంది.

100 గ్రాముల చియా సీడ్స్ లో 631 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల సోయాబీన్ గింజలలో 277 మిల్లీ గ్రాములు, 100 గ్రాముల రాజ్మా గింజల్లో 143 మిల్లీ గ్రాములు, 100 గ్రాములు పొద్దుతిరుగుడు గింజలలో 78 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. వీటితో పాటు బచ్చలికూరలోనూ క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల బచ్చలికూరలో 99 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల బ్రోకలిలో 47 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఇక గుడ్డులోనూ క్యాల్షియం ఉంటుందని మనందరికీ తెలిసిందే. 100 గ్రాముల గుడ్డులో 50 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది.

బాదంపప్పు కూడా ఎముకల ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. 60 గ్రాముల బాదంపప్పులో 120మిల్లీ గ్రాముల క్యాల్షియం.. 2 కప్పుల బెండకాయల్లో 88 మిల్లీగ్రాముల క్యాల్షియం, 200 గ్రాముల నారింజ పండ్లలో 80 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. వీటి వల్ల ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. దృఢంగా కూడా ఉంటాయి.

Also Read : Vitamin D : సూర్య కిరణాలే కాదు, ఈ పానీయాలు విటమిన్ డి లోపాన్ని నయం చేస్తాయి..!

 

Exit mobile version