Hemoglobin Foods : హిమోగ్లోబిన్.. ఇది ఎర్ర రక్తకణాలలో కనిపించే ప్రొటీన్. శరీరం మొత్తానికి ఆక్సిజన్ సరఫరా చేయడంలో ఎర్రరక్తకణాలదే కీలక పాత్ర. అలాంటి ఎర్రరక్తకణాల్లో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువైతే.. దాని ప్రభావం శరీర పనితీరుపై ప్రభావం పడుతుంది. హిమోగ్లోబిన్ శాతం తగ్గితే రక్తహీనతతో పాటు.. కాలేయం, మూత్రపిండాల పనితీరుపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే తరచూ తలనొప్పి, అలసట, బలహీనత, కామెర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే.. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
బీట్ రూట్ లో ఐరన్, మెగ్నీషియం, కాపర్, ఫాస్ఫరస్, విటమిన్స్ బీ1, బీ2, బీ6, బీ12, C పుష్కలంగా ఉంటాయి. హిమోగ్లోబిన్ కౌంట్ ని పెంచేందుకు, ఎర్రరక్త కణాలను ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతాయి.
మునగ ఆకులలో జింక్, కాపర్, మెగ్నీషియం, విటమిన్ ఎ, బి, సి వంటి ఖనిజాలున్నాయి. ఇవన్నీ ఐరన్, హిమోగ్లోబిన్, ఎర్రరక్తకణాలకు చాలా అవసరం. ఈ ఆకుల్లో బెల్లం కలిపి తీసుకుంటే.. మరింత ఫలితం ఉంటుంది.
బచ్చలికూర, ఆవాలు, సెలెరీ, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పచ్చిఆకుల్లో ఉండే విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఇతర పోషకాలు హిమోగ్లోబిన్ ను పెంచేందుకు పనిచేస్తాయి. క్యాబేజీ జాతికి చెందిన బ్రోకలి ఐరన్, బీ-కాంప్లెక్స్ విటమిన్ ఫోలిక్ యాసిడ్ మంచి మూలం. దానిమ్మలో ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఇనుము వంటివి ఉంటాయి. ప్రతిరోజూ దానిమ్మజ్యూస్ తాగితే.. హిమోగ్లోబిన్ త్వరగా పెరుగుతుంది.