weightgain food : బరువు పెరగాలనుకుంటున్నారా ? అయితే వీటిని తినండి..

బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా నానబెట్టిన పల్లీలను రెండు గుప్పెళ్ల మోతాదులో తీసుకోవాలి. ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, మొలకెత్తిన గింజలు, 10 ఖర్జూరపండ్లను..

  • Written By:
  • Publish Date - November 27, 2023 / 07:00 AM IST

Waitgain food : బరువు తగ్గడమే కాదు.. పెరగడం కూడా చాలామంది సమస్య. ఎముకలు పైకి కనిపించేంత సన్నగా ఉండేవారు కూడా ఉంటారు. ఇలా సన్నగా ఉన్నవారు బరువు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. బరువు పెరగాలని జంక్ ఫుడ్ తింటారు. దానివల్ల కొవ్వు పెరుగుతుంది కానీ.. కండ పెరగదు. అందుకే కండను పెంచే ఆహారాలను తీసుకోవాలి. అందులోభాగంగా.. మాంసాన్ని ఎక్కువగా తింటారు. కానీ.. అందరూ వీటిని తినలేరు.

తక్కువ ఖర్చుతో.. సులభంగా కండను పెంచే ఆహారాలున్నాయి. అయితే.. బరువు పెరగాలనుకునేవారిలో అరుగుదల, ఆకలి రెండూ ఎక్కువగా ఉండాలి. అలాగే మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవాలి. ముందుగా రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీరు లేదా.. మామూలు నీరు తాగి సుఖవిరేచనం అయ్యేలా చూసుకోవాలి.

బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా నానబెట్టిన పల్లీలను రెండు గుప్పెళ్ల మోతాదులో తీసుకోవాలి. ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, మొలకెత్తిన గింజలు, 10 ఖర్జూరపండ్లను తీసుకోవాలి. వీటితో పాటు సపోట, జామ, అరటి వంటి పండ్లను కూడా తీసుకోవాలి.

వీటన్నింటినీ తినడం వల్ల ప్రొటీన్ లభిస్తుంది. మధ్యాహ్నం వరకూ నీటిని తాగుతూ ఉండాలి. మధ్యాహ్న భోజనంలో ముడిబియ్యం అన్నం, జొన్న అన్నం, కొర్రల అన్నం వంటి వాటిని 60 శాతం, 20 శాతం ఆకుకూర పప్పు, 20 శాతం కూరలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడప్పుడు సోయా గింజలు, మిల్ మేకర్ కూరలను కూడా తినాలి. భోజనం తర్వాత సాయంత్రం 6 గంటల వరకూ నీరు తాగుతుండాలి. ఇతర ఆహారాన్ని తీసుకోకూడదు.

6 గంటలకు పుచ్చగింజల పప్పు, ప్రొద్దు తిరుగుడు పప్పు, గుమ్మడి గింజల పప్పు, బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా వంటి వాటిని నానబెట్టి తీసుకోవాలి. తర్వాత అరటిపండ్లు, సపోటా, సీతాఫలం, ఎండు ఖర్జూరాలని 7 గంటల్లోగా తినాలి. ఇలా చేస్తే డైట్ కంట్రోల్ లో ఉండటంతో పాటు.. కండ పెరిగి హెల్దీగా వెయిట్ పెరుగుతారు.