Site icon HashtagU Telugu

Foods for Long Hair : జుట్టు పెరగడం లేదా ? వీటిని తినండి

long hair tips

long hair tips

Foods for Long Hair : మన తాతమ్మలకు చాలా పొడవాటి జుట్టు ఉండేది. కానీ ఈ కాలంలో ఎక్కడ చూసినా కొత్తిమీర కట్టలే. అక్కడక్కడా ఎప్పుడో ఒకసారి వాలుజడలు కనిపిస్తుంటాయి. ఆ మధ్య పోనీ టెయిల్స్ స్టైల్ వచ్చినపుడు చాలామంది హెయిర్ కట్ వైపే అడుగులు వేశారు. ఇప్పుడు మళ్లీ పొడవాటి జుట్టుకోసం వెంపర్లాడుతున్నారు. కానీ.. ఎన్ని హెయిర్ ఆయిల్స్ వాడినా, ఎన్ని హెర్బల్ షాంపూలు వాడినా జుట్టు మాత్రం పెరగడం లేదు. జుట్టు ఆరోగ్యంగా, అందంగా, పొడవుగా ఉండాలంటే.. అది పైపై మెరుగులతో సాధ్యంకాదు. మంచి ఆహారం కూడా తీసుకోవాలి.

జుట్టుపెరుగుదలకు కెరాటిన్ అనే ప్రొటీన్ చాలా అవసరం. అనేక రకాల విటమిన్స్, మినరల్స్ కూడా జుట్టు పెరుగుదలకు అవసరమవుతాయి. ఇవన్నీ మన జుట్టుకి అందితేనే జుట్టు పెరుగుదల బాగుంటుంది. జుట్టు దృఢంగా, పొడవుగా పెరగాలంటే కొన్ని ఆహారాలను తినడం తప్పనిసరి.

రోజువారీ ఆహారంలో గుడ్డును తినాలి. ఇందులో ఉండే ప్రొటీన్ జుట్టు ఎదుగుదలకు సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా, దృఢంగా ఉంటాయి. అలాగే ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు ఎదుగుదల ఆగిపోతుంది. ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ తో పాటు విటమిన్ సి కూడా సమానంగా ఉండాలి. అంటే నిమ్మజాతికి చెందిన పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి తో పాటు కొల్లాజెన్ కూడా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు కూడా త్వరగా పెరుగుతుంది.

జుట్టు పెరుగుదలకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఎంతో అవసరమవుతాయి. అలాగే బయోటిన్, విటమిన్ ఎ కూడా అవసరం. బాదం, వాల్ నట్స్, అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. తృణధాన్యాల్లో బయోటిన్ అధికంగా ఉంటుంది. క్యారెట్లలో విటమిన్ ఎ ఎక్కువగా క్యారెట్ లో ఉంటుంది. క్యారెట్ ను సలాడ్ గా లేదా.. జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ ఇ కూడా ఒకటి. రక్తప్రసరణను పెంచడంలో, తల చర్మం యొక్క పిహెచ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ ఇ అవకాడోల్లో అధికంగా ఉంటుంది. ఇలా ఈ పోషకాలున్న ఆహారాలను తీసుకుంటే.. జుట్టు ఆరోగ్యంగా, బలంగా, పొడవుగా పెరుగుతుంది.

Also Read : Egg yolk : గుడ్డులో పచ్చసొన తినడం లేదా ? ఈ విషయాలు తెలుసుకోండి