Hangover Foods: న్యూ ఇయర్ ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారా ? గ్రాండ్ గా అంటే.. మందేసే ఉంటారు కదూ. అర్థరాత్రి వరకూ పార్టీ మూడ్ లో ఫుల్ గా మందేయడంతో హ్యాంగోవర్ పట్టి పీడిస్తోందా? డోంట్ వర్రీ. ఖాళీకడుపుతో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ వస్తుంది. ఆల్కహాల్ తీసుకున్నాక ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఈ ఫుడ్స్ తినండి.
ఆల్కహాల్ తీసుకునే ముందు ఓట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆల్కహాల్ శరీరానికి హానికరం కాబట్టి ఓట్స్ ను తినడం వల్ల ప్రొటీన్, ఫైబర్ వంటి పోషకాలు శరీరానికి అందుతాయి.
అలాగే వైన్ తాగేముందు అరటిపండ్లు తినాలి. అరటిపండులోని చక్కెరలు శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతాయి. ప్రొటీన్స్ పుష్కలంగా ఉన్న గుడ్లు తిన్నా.. హ్యాంగోవర్ నుంచి తప్పించుకోవచ్చు.
అలాగే.. వైన్ తీసుకుంటే చేపల్ని తినొచ్చు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటితోపాటు పెరుగు తీసుకున్నా చాలా మంచిది. ఇందులో ప్రొటీన్, కొవ్వు, పిండి పదార్థాలుంటాయి. అందుకే హ్యాంగోవర్ ఉన్నవారు మజ్జిగ తాగితే.. హ్యాంగోవర్ తగ్గుతుంది.