Fridge: వామ్మో.. ఈ ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెడితే అంత డేంజరా?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మారుమూల

  • Written By:
  • Publish Date - April 25, 2023 / 05:30 PM IST

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మారుమూల పల్లెటూరి నుంచి పెద్ద పెద్ద సిటీల వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ లు తప్పనిసరిగా ఉంటున్నాయి. అయితే ప్రస్తుత రోజుల్లో ఫ్రిడ్జ్ లు వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నారు. కానీ ఇదివరకటి రోజుల్లో అనగా పాతకాలంలో ఫ్రిడ్జ్ లు లేకపోవడంతో దేన్నీ అయినా కూడా బయటనే నిల్వ ఉంచేవారు. అవి పాడవకుండా అలాగే ఉండేవి. ఇప్పుడు చాలామంది రాత్రి మిగిలిన భోజనాలను కూరలను ప్రతి ఒక్కటి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టడం అలవాటు చేసుకున్నారు.

అయితే అలా పెట్టడం చాలా ప్రమాదకరం అన్న విషయం చాలామందికి తెలిసి కూడా వాటిని మానుకోవడం లేదు. అలా ఫ్రిజ్లో మిగిలిన ఆహారం పెట్టడం వల్ల ఆ ఆహారాల్లో బాక్టీరియా ఎక్కువ అయ్యి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరి ఫ్రిడ్జ్ లో ఎటువంటి ఆహార పదార్థాలు నిల్వ ఉంచకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గుడ్లను పగలగొట్టకుండా ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే అలా పెట్టడం వల్ల పెంకు పగిలిపోయే అవకాశం ఉంది. దాంతో బాక్టీరియా చేరుతుంది.

అలా ఉన్న ఎగ్స్ ను మనం తీసుకోవడం ప్రమాదం ఒకవేళ మీరు గుడ్లను ఫ్రిడ్జ్ లో పెట్టాలంటే గాలి కూడా వెళ్లని చిన్న బాక్స్ తీసుకుని అందులో ఎగ్స్ ను పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అలాగే చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే పండ్లను ఫ్రిడ్జ్ లో ఉంచుతారు. దాని వల్ల ఆ పండ్ల రుచి తగ్గుతుంది. అలా పెట్టడం ద్వారా పోషకాలు అందకుండా పోతాయి. దోసకాయలు ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల వాటి రుచి మారిపోతుంది. అలాగే దోసకాయ సాగినట్టుగా తయారవుతాయి. ఫ్రై చేసిన ఆహారాలను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల కారకరలాడే గుణం పోయి సాగినట్టుగా తయారయ్యి తినడానికి పనికిరాకుండా అవుతాయి. టమాటా సాస్ ను ఫ్రిడ్జ్ లో పెడితే సాస్ నుండి నీళ్లు విడిపోయి సాస్ రుచి లేకుండా పోతుంది. అందుకే టమాటా సాస్ ని ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు.