మన శరీరానికి అవసరమైన శక్తి ఆహారం (Food) ద్వారానే లభిస్తుంది. అయితే నేడు ఎక్కువ మంది అప్పటికప్పుడు తృప్తికి అలవాటుపడుతూ బయట దొరికే చిరుతిండ్లపై ఆధారపడుతున్నారు. ఇవి తినడం వల్ల రుచిగా అనిపించినా, ఇవి శరీరానికి హానికరమైన బ్యాక్టీరియాల వేదికగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్, నిల్వ ఉంచిన పదార్థాలు, సరిగ్గా వండని లేదా నిల్వచేయని ఆహారం ఫుడ్ పాయిజన్ కి కారణమవుతుంటుంది. ఈ ఫుడ్ విషం వలన శరీరంలో విపరీతమైన, వాంతులు, కడుపునొప్పి, డయేరియా వంటి లక్షణాలు తలెత్తుతాయి.
Gaddar Film Awards : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక డేట్ & వేదిక ఫిక్స్
కలుషిత ఆహారంలో సాల్మోనెల్లా, ఇ.కొలి వంటి హానికర పాథోజెన్స్ ఉంటాయి. ఇవి సరైన ఉష్ణోగ్రతలో వండకపోతే లేదా నిల్వచేయకపోతే వేగంగా పెరిగి ఆహారాన్ని విషంగా మార్చేస్తాయి. ప్రత్యేకంగా మాంసాహార పదార్థాలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, ఫ్రూట్ సలాడ్స్, కస్టర్డ్ వంటి డిజర్ట్లు ఎక్కువగా కలుషితమవుతాయి. దీనిపై అత్యంత దృష్టి అవసరం. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు, మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఫుడ్ పాయిజన్ బారిన త్వరగా పడతారు. వీరి ఆరోగ్యం మరింతగా ప్రమాదంలో పడే అవకాశముంది.
AP Government : ఉపాధి హామీ పనుల కోసం రూ. 176.35 కోట్ల విడుదలకు అనుమతి
ఫుడ్ పాయిజన్ (Food Poisoning) అయిన తరవాత కొన్ని సార్లు 24 గంటల్లోగానే లక్షణాలు బయటపడతాయి. మరి కొన్ని సందర్భాల్లో 5 రోజుల తరవాత కూడా తెలుస్తాయి. అయితే..నీరసం, కడుపు నొప్పి, డయేరియా లాంటి సింప్టమ్స్ కనిపిస్తే అవి ఫుడ్ పాయిజన్ కి సంకేతాలు. వీటితో పాటు వాంతులు,జ్వరం, తలనొప్పి కూడా తీవ్రంగా వేధిస్తాయి. ఈ ఇబ్బంది రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఫుడ్ పాయిజన్ నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఆహార పదార్థాలను శుభ్రంగా కడగాలి. పాడైన, ఎక్స్‌పైరీ అయిన లేదా కిందపడిన ఆహారాన్ని వాడకూడదు. వంటకు ముందు చేతులు సరిగ్గా కడుక్కోవాలి. ఆహారాన్ని కనీసం 75 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వండాలి. అలాగే వేడి లేదా చల్లగా ఉండే టెంపరేచర్ లో ఫుడ్ నిల్వ ఉంచాలి. మంచి ఆహార అలవాట్లతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తినే ప్రతి పదార్థం శరీరాన్ని ప్రభావితం చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి.