Coriander Seeds: ధనియాల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

ప్రతి ఒక్కరి వంటగదిలో ధనియాలు తప్పనిసరిగా ఉంటాయి. ముఖ్యంగా భారతీయులు వంటకాలలో ఈ ధనియాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ధనియాల

Published By: HashtagU Telugu Desk
Coriander Seeds

Coriander Seeds

ప్రతి ఒక్కరి వంటగదిలో ధనియాలు తప్పనిసరిగా ఉంటాయి. ముఖ్యంగా భారతీయులు వంటకాలలో ఈ ధనియాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ధనియాలతో కొత్తిమీర వస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం కూరల్లో మాత్రమే కాకుండా ధనియాలను సుగంధ ద్రవ్యాల్లో కూడా ఉపయోగిస్తారు. అలాగే ఆహారాన్ని కొత్తిమీర ఆకులతో ఆహారాన్ని అలంకరిస్తారు. ధనియాలు మంచి కమ్మటి వాసనను కలిగి ఉంటాయి. కూరకు రుచిని కూడా పెంచుతాయి. వీటి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ధనియాల నీరు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ధనియాలను నీటిలో నానబెట్టి నీటిని తాగడం వల్ల శరీరంలోని అనేక సమస్యలను నివారించవచ్చు. ఇందుకోసం వీటిని 4 స్పూన్లు రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటి గింజల్లో గింజల్లో ఉండే అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు కళ్లలో దురద, మంట, ఎర్రబడడం వంటి వాటికి బాగా ఉపయోగపడతాయి. ధనియాలు నానబెట్టిన నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు రోజూ ఈ నీటిని తాగవచ్చు. ధనియాలను రాత్రి పడుకునే ముందు చల్లటి నీళ్లలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని కళ్లపై చల్లుకుని కడుక్కోవాలి.

ఈ నీరు కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. ఇలా రోజూ చేస్తే కంటి ఇన్ఫెక్షన్ దరిచేరదు. బహిష్టు సమస్యలు 6 గ్రాముల ధనియాల గింజలను 500 మి.లీ నీటిలో మరిగించి 1 టేబుల్ స్పూన్ తేనె వేసి వేడిగా తాగాలి. ఇది శరీరంలోని ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. రుతు చక్రం మెరుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. కొంతమంది మహిళలు ఎముకల సమస్యలతో బాధపడుతుంటారు. ఇటువంటి వారు కూడా వారానికి రెండు సార్లు ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు కలగడంతో పాటు ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.

  Last Updated: 17 Sep 2023, 07:25 PM IST