Diabetes: ఈ టిప్స్ పాటిస్తే షుగర్ వ్యాధికి శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు?

ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. దీనిని చెక్కర వ్యాధి లేదా మధుమేహం అని కూడా పిలుస్తారు.

  • Written By:
  • Publish Date - September 8, 2022 / 01:22 PM IST

ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. దీనిని చెక్కర వ్యాధి లేదా మధుమేహం అని కూడా పిలుస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలిలో ఆహారపు అలవాట్ల కారణంగానే ఈ డయాబెటిస్ వస్తోంది అని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలకే ఈ డయాబెటిస్ రావడంతో వారు అతి చిన్న వయసులోనే అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కావాల్సింది తినలేక ఏదైనా తినాలి అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ డయాబెటిస్ ఉన్నవారు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే ఈ డయాబెటిస్ వ్యాధి ఒక్కసారి వచ్చింది అంటే చాలు ఇక మనం చనిపోయే వరకు అలాగే ఉంటుంది. ఈ డయాబెటిస్ కి పూర్తిగా విరుగుడు మందు ఇంకా కనుగొనలేదు. కానీ ఈ డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచడానికి మాత్రం అనేక రకాల ఆయుర్వేదిక్ అలాగే మెడికల్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి సుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతూ ఉంటాయి. మరి కొంతమంది ఎక్కడ వారికి సుగర్ వస్తుందేమో అన్న భయంతో తీపి అలాగే కొన్ని రకాల పదార్థాలను తినడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు.

అయితే అటువంటి వారు కొన్ని రకాల ఆరోగ్య సూచనలు సలహాలు పాటించడం వల్ల షుగర్ వ్యాధికి దూరంగా ఉండవచ్చు. అంతేకాకుండా ఆ వ్యాధి వచ్చే అవకాశాల నుంచి కూడా తప్పించుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..అందుకోసం ప్రతి రోజు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. అదేవిధంగా ఎంత ఆకలి వేస్తే అంత మాత్రమే తినాలి. అలాకాకుండా కొంతమంది మితిమీరి ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. అలా చేయకూడదు. ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.కొవ్వు పదార్థాలను కూడా పరిమితంగా తీసుకోవాలి. అలాగే పెరుగు లాంటి ప్రోబయోటిక్ ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్ర పోకుండా కొంచెం సేపు అటూ ఇటూ తిరిగి ఆ తర్వాత పడుకోవడం మేలు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకొని మానసికంగా, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇక ప్రధానంగా ధూమపానం మద్యపానం లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ చిట్కాలను పాటిస్తూ సరే నా ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనం షుగర్ వ్యాధికి దూరంగా ఉండవచ్చు.