‎Winter Tips: శీతాకాలంలో కడుపు,గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సూపర్ టిప్స్ మీకోసమే!

Winter Tips: శీతాకాలంలో కడుపు గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను ఫాలో అయితే చాలు అని చెబుతున్నారు. అవేంటో ఎప్పుడు మనం తెలుసుకుంధాం.

Published By: HashtagU Telugu Desk
Winter Tips

Winter Tips

Winter Tips: ప్రస్తుత రోజుల్లో ప్రతీ చిన్న అనారోగ్య సమస్యకు మందులు తీసుకోవడం అన్నది సర్వ సాధారణం అయిపోయింది. తలనొప్పి, అజీర్ణం, గ్యాస్, గొంతు నొప్పి వస్తే చాలు ప్రజలు వెంటనే మందుల వైపు పరుగెత్తుతారు. కానీ మన వంటగదిలోనే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా శరీరాన్ని బలోపేతం చేసే సహజ నివారణలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. వంటింట్లో దొరికే వాటితోనే కొన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అల్లం నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మంటను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుందట.

‎అల్లం దాని వేడెక్కే ప్రభావం, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నొప్పిని తగ్గించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిందట. నిమ్మకాయ శరీరాన్ని శుభ్రపరుస్తుందట. విటమిన్ సి మద్దతును అందిస్తుందని చెబుతున్నారు. విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుందట. రోజూ ఒక టీస్పూన్ సరైన పద్ధతిలో తీసుకుంటే, అది అనేక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. కాగా రోజుల్లో ప్రతి రెండవ వ్యక్తికి గ్యాస్, అజీర్ణం, వికారం, బరువుగా అనిపించడం లేదా పొత్తికడుపు ఉబ్బరం అనేవి సాధారణ సమస్యలు అని చెప్పాలి. అల్లం జీర్ణక్రియను సక్రియం చేస్తుందట. నిమ్మకాయ ఆహారాన్ని త్వరగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే నిమ్మరసం, అల్లం తరచుగా తీసుకుంటే కడుపు నొప్పి సమస్య చాలా వరకు నియంత్రణలో ఉంటుందట.

‎ చలికాలంలో శరీరం మందగిస్తుంది. దీని వల్ల కొవ్వు త్వరగా పేరుకుపోతుందట. అల్లం జీవక్రియను వేగవంతం చేస్తుందని, నిమ్మకాయ కొవ్వును కరిగించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. దాంతో ఉదర ఉబ్బరాన్ని తగ్గిస్తుందట. బరువు నియంత్రణలో ఉంచుతుంది, శరీరాన్ని శుభ్రపరుస్తుందని చెబుతున్నారు. కాగా అల్లం గొంతు నొప్పి, బొంగురుపోవడం, దగ్గు లేదా ప్రారంభ జలుబులకు గొప్ప ఉపశమనాన్ని అందిస్తుందట. అల్లం యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుందట. నిమ్మకాయ రోగనిరోధక శక్తిని పెంచుతుందట. కఫాన్ని కూడా తగ్గిస్తుందట. గొంతు నొప్పిని తగ్గిస్తుందని, దగ్గు తీవ్రంగా ఉంటే, ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే మీకు త్వరగా ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. అల్లం రసం రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడానికి సహాయపడుతుందట. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో నిమ్మకాయ సహాయకారిగా పని చేస్తుందని చెబుతున్నారు. అయితే ఒక టీస్పూన్ తాజా అల్లం రసం + ఒక టీస్పూన్ నిమ్మరసం, ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కారంగా ఉంటే, ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలపాలట. తేనెతో కలిపి తీసుకోవాలని 10 నుంచి 15 రోజులు నిరంతరం తీసుకోవాలని తరువాత 2 నుంచి రోజుల విరామం తీసుకోవాలని చెబుతున్నారు.

  Last Updated: 25 Nov 2025, 11:36 AM IST