Monsoon Diet: వానా కాలంలో ఈ డైట్ ఫాలో అయితే చాలు.. రోగాలు దరిదాపుల్లోకి కూడా రావు?

మామూలుగా వర్షాకాలం వచ్చింది అంటే చాలు సీజనల్ వ్యాధులు కూడా ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా వర్షాకాలంలో తొందరగా ఇన్ఫెక్షన్ల బారిన

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 09:40 PM IST

మామూలుగా వర్షాకాలం వచ్చింది అంటే చాలు సీజనల్ వ్యాధులు కూడా ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా వర్షాకాలంలో తొందరగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. ఈ అధిక వర్షాల కారణంగా ఎక్కడ చూసినా నీళ్ళు నిలబడి ఉండడంతో అక్కడ వాలిన దోమలు మళ్ళీ మనల్ని కుట్టడం వల్ల అనేక రకాల రోగాలు కూడా ఉంటాయి. అయితే వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెరగాలి అన్న అటువంటి రోగాలు దరి చేరకుండా ఉండాలి అంటే ఈ డైట్ ని ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి ఆ డైట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వర్షాకాలంలో మజ్జిగ, పెరుగు, సోయా బీన్స్ వంటి ప్రొబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాతో నిండి ఉంటాయి.

ఇవి వర్షాకాలంలో జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ కి వ్యతిరేకంగా పోరాడేందుకు ఉపయోగపడతాయి.. అనగా నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లు తీసుకుంటూ ఉండాలి. మొలకలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోటీన్ రిచ్ మొలకలు అల్పాహారంలో తీసుకుంటే మంచిది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరం జెర్మ్స్ తో పోరాడేందుకు సహాయపడుతుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

వర్షాకాలంలో ఫిట్ గా ఉండేందుకు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు పాలు తాగాలి. తులసిని పవిత్రమైన మూలికగా పరిగణిస్తారు. ఒత్తిడిని తగ్గించి శక్తి స్థాయిలని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి.పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఇతర జీర్ణాశయాంతర సమస్యల్ని తగ్గిస్తుంది. జ్వరాన్ని తగ్గించే గుణాలు ఉండటమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్లంలో జింజెరోల్స్, పారాడోల్స్, సెస్క్విటెర్పెనెస్, షోగోల్స్ తో నిండి ఉన్నాయి. ఇవన్నీ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు. జలుబు, ఫ్లూని దూరంగా ఉంచుతుంది.