Weightloss Tips : ఈ చిట్కాలు పాటిస్తే.. నెలకు 5 కేజీలు తగ్గుతారు..

అతిగా ఆహారాన్ని తినడం తగ్గించుకోవాలి. తినే ప్లేటు కూడా మన తిండిని, ఆకలిని ప్రభావితం చేస్తుంది. పెద్దప్లేటులో తక్కువ ఆహారం తింటే.. ఇంకా తినాలనిపిస్తుంది, చిన్న ప్లేటులో తింటే..

  • Written By:
  • Publish Date - February 12, 2024 / 11:56 PM IST

Weightloss Tips : చురుగ్గా పనిచేయాలన్నా, నడిచేటపుడు ఆయాసం రాకుండా ఉండాలన్నా, ఏ పనైనా తేలికగా చేయగలగాలన్నా.. మన శరీరం సహకరించాలి. అలా సహకరించాలంటే.. మన శరీరం మన ఆధీనంలో ఉండాలి. అధికబరువు అనేక అనర్థాలకు దారితీస్తుంది. సరైన ఆహార విధానం, జీవనశైలి పాటిస్తే.. ఈజీగా తగ్గొచ్చు. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉంటూ.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ.. హెల్దీ ఆహారం తినడం అవసరం. బరువు తగ్గాలన్న లక్ష్యాన్ని స్థిరంగా ఉంచుకోవాలి.

మనం ఉండే తీరు కూడా.. బరువును తగ్గించే ప్రణాళికలకు తోడు మనం ఉండే తీరు కూడా ముఖ్యం. ఒక వ్యక్తికి ఎలాంటి శిక్షణ పనిచేస్తుందో.. మరో వ్యక్తికీ అలాంటిదే పనిచేస్తుందని గ్యారెంటీ లేదు. మీ శరీరంపై మీరు శ్రద్ధ వహించడం చాలా అవసరం. కొన్ని చిట్కాలు బరువు తగ్గించడంలో చాలా ఉపయోగపడుతాయి. అవేంటో చూద్దాం.

పోషకాహారం మీ డైట్ లో భాగమవ్వాలి. కేలరీలను తగ్గించేందుకు.. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాల పరిమాణాన్ని పెంచుకోవాల. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. తక్కువ కేలరీలతో ఉండే ఆహారం.. కడుపు త్వరగా నింపుతాయి.

అతిగా ఆహారాన్ని తినడం తగ్గించుకోవాలి. తినే ప్లేటు కూడా మన తిండిని, ఆకలిని ప్రభావితం చేస్తుంది. పెద్దప్లేటులో తక్కువ ఆహారం తింటే.. ఇంకా తినాలనిపిస్తుంది, చిన్న ప్లేటులో తింటే.. ఎక్కువగా తినేశామన్న భావన కలుగుతుంది. గిన్నెలు, ప్లేట్లు, పాత్రల పరిమాణాన్ని తగ్గిస్తే.. బరువు అదే తగ్గుతుంది. అలాగే.. కంప్యూటర్లు, టీవీల ముందు కూర్చుని తినడం, తినేటపుడు మొబైల్ చూసే అలవాట్లుంటే మార్చుకోవాలి.

బరువు తగ్గేందుకు వ్యాయామం కూడా చాలా ముఖ్యం. ఏరోబిక్ యాక్టివిటీ, చురుకైన నడక లేదా సైక్లింగ్ వంటివి చేయాలి. ఏరోబిక్స్ మీ బరువును తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. కేలరీలు త్వరగా బర్న్ అవుతాయి.

రోజంగా హైడ్రేటెడ్ గా ఉండేందుకు నీరు తరచూ తాగుతుండాలి. హెర్బల్ టీ ని కూడా తాగొచ్చు. నీరు ఎక్కువగా తాగితే.. ఆకలి త్వరగా వేయదు. ఎక్కువగా తినాలన్న కోరిక తగ్గుతుంది.

ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెరతో చేసిన స్నాక్స్, పానీయాల వినియోగాన్ని తగ్గించాలి. అవి చాలా తక్కువ పోషకాలను ఇస్తారు. కేలరీలు అధికం. మీ బరువును తగ్గించాలంటే.. ప్రాసెస్ చేయని ఫుడ్ ను ఎంచుకోవాలి.

నిద్రసరిపోకపోయినా దాని ప్రభావం శరీర బరువుపై పడుతుంది. నిద్రలేమి.. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. అనారోగ్యకరమైన ఆహారాలు తినాలన్న కోరిక పెరుగుతుంది. రాత్రి వేళ 7-9 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండాలి. ఇలా చాలా రెగ్యులర్ గా చేసే పనుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే.. ఒక నెలలో 5 కేజీల వరకూ బరువు తగ్గుతారు.