Site icon HashtagU Telugu

Lose Weight: సమ్మర్ లో ఈ విధంగా చేస్తే చాలు.. ఎంత లావు ఉన్నా నాజూగ్గా మారాల్సిందే!

Lose Weight

Lose Weight

ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువు సమస్య కారణంగా లేనిపోని అనారోగ్య సమస్యలు కూడా కొనితెచ్చుకుంటున్నారు. కొందరు విపరీతమైన బరువు కారణంగా సొంతంగా వారి పనులు వారు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఆయాస పడుతూ ఉంటారు. అధిక బరువును తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మంచి ఫలితాలు కనిపించవు. బరువు తగ్గడానికి డైటింగం, వ్యాయమం వంటి దినచర్యలను అనుసరిస్తుంటారు. అయితే బరువు పెరగడం ఈజీనే కానీ తగ్గడం అన్నది అంత తేలిక కాదు. ఎందుకు అంటే ఒక్కసారి బరువు పెరిగారు అంటే దాన్ని తగ్గించాలంటే చాలానే శ్రమించాలి. అనేక కఠిన నియమాలను ఫాలో అవుతూ ఉండాలి. అయితే ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో ఈ సమ్మర్ సీజన్ లో అధిక బరువును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి ప్రయత్నించేటప్పుడు విటమిన్లు, ఖనిజాలు కలిగిన ఆహారాన్ని తినాలట. అలాగే సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు బరువు తగ్గడానికి చాలా సహాయపడతాయట. వేసవి కాలంలో దోసకాయలు, టమోటాలు, పుచ్చకాయ వంటి హైడ్రేటింగ్ ఆహారాలను చేర్చుకోవాలని చెబుతున్నారు. గ్రీన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గడానికి సహాయపడతాయట. అలాగే జీవక్రియను వేగవంతం చేయడమే కాకుండా శరీరం నుండి అదనపు కొవ్వును కాల్చడంలో కూడా ఇది సహాయపడుతుందట..ముఖ్యంగా ఉదయం పూట రెండు నుండి మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. గ్రీన్ టీతో పాటు, మీరు హెర్బల్ టీ కూడా తాగవచ్చని చెబుతున్నారు. వేసవి కాలంలో మీ ఆహారంలో ఫైబర్, ప్రోబయోటిక్స్ చేర్చుకోవాలట.

మీరు ప్రతిరోజూ పెరుగు, పండ్లు, సలాడ్లు, తృణధాన్యాలు తినాలని చెబుతున్నారు. ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుందట. దీంతో అతిగా తినకుండా మిమ్మల్ని నిరోధిస్తుందట. ప్రో బయోటిక్స్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయట. శరీర జీవక్రియను పెంచుతాయట. అలాగే ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అంతేకాకేుండా ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఎక్సర్ సైజ్ లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలట. మీరు ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో వ్యాయామం చేయవచ్చని చెబుతున్నారు. మీరు వ్యాయామం చేయలేకపోతే కనీసం అరగంట పాటు వాకింగ్ అయినా చేయాలని చెబుతున్నారు. నడకతో కేలరీలను బర్న్ అవుతాయని, కండరాలను బలపరుస్తుందని చెబుతున్నారు.