Pigmentation : మంగుమచ్చలు తగ్గడం లేదా ? ఇలా ట్రై చేయండి

మహిళల శరీరంలో ప్రొజెస్టిరాన్ పెరిగి.. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గడం వల్ల మంగుమచ్చలు ఏర్పడుతాయి. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల కూడా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. శరీరం లోపల ఉండే మెలనోసైట్స్.. మెలనిన్ ను ఉత్పత్తి చేస్తాయి.

  • Written By:
  • Publish Date - April 19, 2024 / 07:44 PM IST

Pigmentation Remedies : ముఖం అందవిహీనంగా కనిపించడానికి గల కారణాల్లో మంగు మచ్చలు ఒక కారణం. ఆగ, మగ తేడా లేకుండా ఈ సమస్య కనిపిస్తుంటుంది. అయితే పురుషుల కంటే స్త్రీ లలోనే మంగు మచ్చల సమస్య అధికం. మంగు మచ్చలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మహిళల శరీరంలో ప్రొజెస్టిరాన్ పెరిగి.. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గడం వల్ల మంగుమచ్చలు ఏర్పడుతాయి. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల కూడా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. శరీరం లోపల ఉండే మెలనోసైట్స్.. మెలనిన్ ను ఉత్పత్తి చేస్తాయి. చర్మంపై ఎక్కడ ఎండ ఎక్కువగా పడుతుందో.. అక్కడ మెలనోసైట్స్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా మెలనిన్ అధికంగా ఉత్పత్తి అవ్వడంతో.. ఆ భాగంలో చర్మం నల్లగా మారి.. మంగుమచ్చలు వస్తాయి. దీనివల్ల అందవిహీనంగా కనిపిస్తారు.

సాధారణంగా గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా మంగుమచ్చలు వస్తాయి. వీటిని తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసి.. విసిగిపోయుంటారు. మంగు మచ్చల సమస్య ఉన్నవారు సోయాబీన్స్ ఎక్కువగా తినాలి. వీటిలో ఈస్ట్రోజన్ అధికంగా ఉంటుంది. 40-50 శాతం ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతుంది. అలాగే.. తేనెను మంగుమచ్చలు ఉన్న ప్లేస్ లో రాయడం వల్ల ఇన్ ఫ్లామేషన్ తగ్గి.. మచ్చలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి తగ్గడానికి కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది. నీటిని ఎక్కువగా తాగుతుండాలి. ఎండలో వెళ్లేటపుడు టోపీ పెట్టుకోవడం లేదా గొడుగు పట్టుకోవడం, ముఖానికి నేరుగా ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read : Eye Cancer: దేశంలో క్యాన్స‌ర్‌ ముప్పు.. కొత్త‌గా కంటి క్యాన్స‌ర్, ల‌క్ష‌ణాలివే..!