Weight Loss: వేగంగా బరువు తగ్గాలంటే.. ఉదయాన్నే ఇలా చేయాల్సిందే?

మామూలుగా చాలామంది అధిక బరువు తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఎక్కువ శాతం మంది హోమ్

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 11:30 AM IST

మామూలుగా చాలామంది అధిక బరువు తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఎక్కువ శాతం మంది హోమ్ రెమిడీలను ఫాలో అవుతూ ఉంటారు. ఇంకొందరు వ్యాయాయలు చేయడం, వాకింగ్ చేయడం లాంటివి చేస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు కలగక దిగులు చెందుతూ ఉంటారు. కొందరు వైద్యులు చెప్పే సలహాలను పాటించడంతోపాటు కొన్ని హోం రెమిడీలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు ఫలితాలు లభించవు.

అయితే ఎక్కువ శాతం మంది వేగంగా బరువు తగ్గాలని ఏవేవో పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వేగంగా బరువు తగ్గడం అన్నది మీ ఆరోగ్యానికి ఎఫెక్ట్ కావచ్చు. అందుకే వైద్యులు కూడా స్లోగా బరువు తగ్గాలని చెబుతూ ఉంటారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బరువు తగ్గాలనుకునే వారు కొన్ని అలవాట్లను తప్పనిసరిగా అలవర్చుకోవాలని, ఉదయాన్నే లేవగానే కొన్ని అలవాట్లను పాటించటం వల్ల వేగంగా బరువు తగ్గడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే పళ్ళు తోముకోకుండానే ఒక గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. పరగడుపున ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అలాగే ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. యోగా కారణంగా మానసిక ఆరోగ్యం మెరుగు పడడమే కాకుండా, బరువు కూడా బాగా తగ్గుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే మార్నింగ్ వాకింగ్ చేయడం అలవాటు చేసుకున్న వారు బరువు బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నడవడం వల్ల శరీరంలో కేలరీలు ఖర్చవుతాయి. దీంతోపాటు సంతోషకర హార్మోన్ల ఉత్పత్తి జరుగుతుంది. ఇది మీ బరువు తగ్గడంతో పాటు, ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.

దీంతో ఊబకాయం సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.
అంతేకాదు ఉదయం పూట ఆరోగ్యకరమైన ఆహారాన్ని అల్పాహారంగా తీసుకోవాలి. నూనె ఎక్కువగా ఉపయోగించే ఆహారాలను వీలైనంతవరకు మానేయడం మంచిది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది. మంచి ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం మిమ్మల్ని బరువు తగ్గేలా చేస్తాయి. ఇక ఈ అలవాట్లను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే వేగంగా బరువు తగ్గవచ్చు. ఆరోగ్యంగా జీవించవచ్చు.